అమెరికా: కాలం అనుకూలించినంత కాలమే

ఈ కారణం చేతన, 2011 చివరిలో అమెరికాలో ‘‘ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం'' ఆరంభం అయ్యింది. ఈ ఉద్యమ నినాదం- ‘‘మేము 99శాతం మందిమి'' అనేది. ఇది వాల్ స్ట్రీట్ తాలూకు ఒక్క శాతం మంది బడా కార్పొరేట్లు, ధనికులకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన నినాదం. అంటే, 2008 సంక్షోభం అనంతరం-2011 నాటికి అమెరికాలోని సమాజం-రెండు మహా వర్గాలుగా చీలిపోయే క్రమం వేగం పుంజుకుంది. దీనిలో భాగంగానే, ‘ఆక్యుపై' ఉద్యమం జరిగిన న్యూయార్క్ నగరంలో మేయర్‌గా అనేక సంవత్సరాల తరువాత ఒక ప్రజాకర్షక విధానాల డెమోక్రిట్లు అధికారంలోకి వచ్చారు. అదీ కథ. అమెరికాలో మొదలైన వర్గ పోరాటపు గాథ.
కాగా, నాడు ఈ పోరాటాన్ని అణచి వేసేందుకు గాను అమెరికా పాలకులు కంకణం కట్టుకున్నారు. సాధారణ పద్ధతులలో తమ దేశంలోని నిరుద్యోగాన్ని తగ్గించలేని, డాలర్ పతనాన్ని నివారించ లేని, ప్రజల కొనుగోలు శక్తి పతనాన్ని ఆపలేని, పేద-ధనిక వ్యత్యాసాల పెరుగుదలను నివారించలేని- అమెరికా పాలకులు నేడు తమ దేశీయ సామాన్య జనంపై దాడికి సిద్ధం అవుతున్నారా అనిపించక మానదు.
ఈ క్రమం నేడు కొత్తగా ఆరంభం అయ్యింది కాదు 2008 ఆర్థిక మాంద్యం తరువాత, కాలం నుంచే ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. అమెరికా దేశంలో అంతర్గతంగా, ఆ దేశ సైన్యం జోక్యానికి అవకాశం కల్పించే విధంగా చట్ట విధివిధానాలు ఆమోదం పొందాయి. అమెరికా దేశంలోని అన్ని చోట్ల ‘ప్రత్యేక ఆయుధాల, వ్యూహరచన, బృందాలు' పుట్టుకుస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వ్రాసింది. అమెరికా అంతర్గత రక్షణ విభాగం (హోంలాండ్ సెక్యూరిటీ) ఈ బృందాల కోసం 36 బిలియన్ల డాలర్ల మేరన బడ్జెట్ లో కేటాయించింది. అంటే, అమెరికా వేగంగా, సైనిక, పోలీస్ రాజ్యంగా మారుతోంది. దీనికి తార్కాణాలు అనేకం.
బోస్టన్‌లో ఒక అనుమానాస్పద యువకుడిని నిర్బంధించేందుకు, మొత్తం నగరాన్ని పోలీసులు దిగ్బంధించారు (ఏప్రిల్, 2013). ప్రతి ఇంటిలోకి చొరబడి గాలింపులు జరిపారు. ఇక, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామీ, తంపా, సెయింట్ లూయీస్, మిన్నెయీపోలీస్, క్రీడ్స్, వర్జీనియా వంటి నగరాల్లో గత సంవత్సరంలోనే, కనీసం అరడజనుకుపైగా సైనిక, వైమానిక విన్యాసాలు జరిగాయి. ఇక, ఇండియానా రాష్ట్రంలో- నగర ప్రాంతాలలో పోరాటాలకు గాను, సైనికులకు శిక్షణ నిచ్చేందుకై -1000 చోట్ల శిక్షణ వసతులు ఏర్పరచారు. అదీ సంగతి... ఈ విధంగా, మెజారిటీ దేశీయ ప్రజల సమస్యలను పరిష్కరించలేని పరిస్థితిలో పడిపోయిన-అమెరికా పాలక వర్గం, ధనికులూ- వారిపై దాడికి సిద్ధం అవుతున్నారు.
ఇక్కడ కారల్ మార్క్స్ ఉర్లీలోన ఒక దానిని స్మరించుకోవచ్చును. ‘‘బూర్జువావర్గం స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాల గురించి మాట్లాడుతుంది, నిజానికి దాని సారం; పదాతిదళం, ఆశ్విక దళం, ఫిరంగి దళం అనేదే...'' కాబట్టి పరిస్థితులు తమకు ప్రతికూలంగా మారనంత సేపే- ఈ పాలకులు ప్రజాస్వామ్యం జపం చేస్తారు. కాగా, పరిస్థితులు చేజారిపోయే స్థితి ఏర్పడితే- ఈ పాలకులు తమ నిజ స్వరూపాలను బయటపెట్టుకొని- ప్రజలపై ఉక్కుపాదం మోపేందుకు వెనుకాడరు! కానీ, చరిత్రలో ఇటువంటి అన్ని సందర్భాలలో గానీ, ఈ సందర్భంలోనూ అంతిమ విజేతలు ప్రజలే.... ఇది అనివార్యం...
-డి పాపారావు
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications