Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహా శివరాత్రి నాడు ఈ వస్తువు ఇంటికి తెచ్చుకుంటే పరమేశ్వరుడి కటాక్షం మీమీదే.. !!

హిందూ ధర్మంలో మహాశివరాత్రికి విశేష ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మంలో ఇది అత్యంత పవిత్రమైన పండుగ. ఈ పర్వం పరమశివుడు, శక్తి స్వరూపిణి పార్వతీ దేవిల దివ్య బంధానికి ప్రతీక. ప్రతి నెలా వచ్చే 'మాసిక శివరాత్రి'కి భిన్నంగా, ఇది సంవత్సరానికి ఒకసారి ఫాల్గుణ మాసంలో వస్తుంది. ఈ పవిత్ర దినాన భక్తులు శివ-పార్వతులను పూజించి, నియమనిష్టలతో ఉపవాసాలు పాటిస్తారు.

మహా శివరాత్రి నాడు శివనామస్మరణ చేస్తూ, రాత్రంతా జాగారణ చేసే వారికి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అదే సమయంలో- కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని కోట్లాదిమంది భక్తులు విశ్వాసం. ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Discover Maha Shivaratri Puja Traditions Observances Rituals and Hinduism Essentials as Rudraksha

పారద శివలింగం..

మహాశివరాత్రి పర్వదినాన ఇంట్లోకి కొన్ని శుభప్రదమైన వస్తువులను తీసుకురావడం ద్వారా ఈశ్వరుని ఆశీస్సులు పొందవచ్చని నమ్మకం. వాటిలో ఒకటి పారద శివలింగం. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు, కాలసర్ప దోషాలు, పితృ దోషాల నుండి మోక్షం లభిస్తుంది. శివపూజకు పారద శివలింగం అత్యుత్తమమైనది. పారద శివలింగంలో సాక్షాత్తు శివుడిని చూడవచ్చని భక్తులు విశ్వసిస్తారు.

108 రుద్రాక్షల జపమాల..

రుద్రాక్షను శివుడి స్వరూపంగా పరిగణిస్తారు. ఇంట్లో 108 రుద్రాక్షల జపమాల ఉంటే, భోళాశంకరుడి అభయం లభిస్తుందని నమ్ముతారు. ఇది సమస్త రోగాలు, దోషాలు, దుఃఖాలను దూరం చేయడంలో సహాయపడుతుంది. మహాశివరాత్రి రోజున రుద్రాక్షను ఇంటికి తీసుకురావడం శుభకరం.

రాగి కలశాన్ని కొనడం..

మహాశివరాత్రి రోజున రాగి కలశాన్ని కొనడం ఫలదాయకం. ఇది కుటుంబంలో మాధుర్యాన్ని, శ్రేయస్సును పెంచుతుంది. శివలింగానికి రాగి కలశంతో జలాభిషేకం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. ఈ రోజును 'అబుజ్ ముహూర్తం'గా భావిస్తారు. వాహనాలు, వెండి వంటి లోహాలను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ధనధాన్య వృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

శివ పార్వతుల ఫొటో..

శివ పరివారం చిత్రాన్ని మహాశివరాత్రి రోజున ఇంటికి తీసుకువచ్చి పూజించడం శుభకరం. ఇందులో పరమశివుడితో పాటు పార్వతి అమ్మవారు, వినాయకుడు, కార్తికేయుడు, నంది, వాసుకి ఉండాలి. శివ పరివారం ఇంటిలో ఉండటం వల్ల కుటుంబానికి ఆశీస్సులు లభిస్తాయి.

Disclaimer: మహా శివరాత్రి నాడు ఆయా వస్తువులను కొనడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం. మరింత సమాచారం కోసం పండితులను సంప్రదించాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+