తెలంగాణ బిల్లు: రాజ్యసభలో ఎవరి బలమెంత?

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును రాజ్యసభలో ముందు ప్రవేశపెడతారనే వార్తల నేపథ్యంలో ఏ పార్టీ బలమెంత అనేది చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభలో ఆ పార్టీకి ఎంత బలం ఉందనే చర్చ సాగుతోంది. కాగా, యుపిఎ ప్రభుత్వం బిజెపి మద్దతు కూడగట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

రాజ్యసభలో తమకున్న బలంతో తెలంగాణ బిల్లును సునాయిసంగా ఆమోదింప చేసుకోవచ్చనే ధీమాతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. రాజ్యసభలోని మొత్తం సభ్యుల సంఖ్య 245కాగా, ఇందులో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 72. తమకు మద్దతుగా నిలిచే పార్టీల బలంతో సునాయసంగా గట్టెక్కవచ్చునని కాంగ్రెసు భావిస్తోంది.

Rajya sabha

ప్రభుత్వానికి మద్దతుగా నిలచే బిఎస్పీకి 15, జెడి(యు)కి 9, డిఎంకెకు 6, ఎన్సీపీకి 6, సిపిఐకి 2, ఆర్జేడీకి 2 మంది సభ్యులున్నారు. వారికి తోడు, ఇతరులు 8 మంది, చిన్నాచితక పార్టీలకున్న 10మంది సభ్యుల మద్దతుతో తెలంగాణ బిల్లును సునాయసగా ఆమోదింప చేసుకోవచ్చని కాంగ్రెసు అధిష్టానం అంచనా వేస్తోంది.

బిజెపి 47మంది సభ్యుల మద్దతు కూడా లభిస్తే తెలంగాణ బిల్లును అత్యధిక మెజారిటీతో ఆమోదింప చేసుకోగలుగుతామని అంటున్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలు మొత్తం 54మంది సభ్యుల మద్దతు మాత్రమే కూడగట్టగలుగుతున్నారు. సిపిఎం 11, టిఎంసి 9, ఎస్పీ 9, అన్నాడిఎంకె 7, బిజెడి 6, తెలుగుదేశం 4, శిరోమణి అకాలీదళ్ 3, శివసేన నలుగురు సభ్యులను కలుపుకుంటే తెలంగాణ బిల్లును గట్టిగా వ్యతిరేకస్తున్న పార్టీల బలం 54మాత్రమే అవుతోంది.

ఈ లెక్కల ప్రకారం రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగినా సంకీర్ణ ప్రభుత్వం సునాయాసంగా విజయం సాధిస్తుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+