వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలే పోలీసు ఆపై పోటా

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్‌ లో కప్పగంతులు
హైదరాబాద్‌ః ఇంటిలిజెన్స్‌ నివేదికలు తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా రావడం, మజ్లిస్‌ సీనియర్‌ నాయకుడు మస్కతి తమపార్టీలో చేరడంతో తెలుగుతమ్ముళ్ళు మహా ఉత్సాహంగా వున్నారు. మస్కతి అదను చూసి తెలుగుదేశంలో చేరడంతో మజ్లిస్‌ పార్టీ గుండె గొంతులోకి వచ్చింది. దెబ్బమీద దెబ్బ అన్న చందంగా మరో సీనియర్‌ ముస్లిం నాయకుడు బాకర్‌ ఆగా శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.

అసలే ఎం.బి.టి. ఓట్లు చీల్చుతుందని భయపడుతున్న మజ్లిస్‌ కు మస్కతి, బాకర్‌ ఆగాల నిష్క్రమణ కోలుకోకుండా చేస్తున్నది. ఒవైసీ నిరంకుశ ధోరణికి విసిగి మజ్లిస్‌ కు కొంతకాలంగా దూరంగా వుంటున్న బాకర్‌ ఆగా కాంగ్రెస్‌ లో చేరుతున్నాడనే వార్తలు రావడంతో పిసిసి అధ్యక్షుడు ఎమ్మెస్సార్‌, కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థి దానం నాగేందరు శుక్రవారం పాతబస్తీ వెళ్ళి బాకర్‌ ఆగా ఇంటివద్ద నానా హంగామా చేశారు. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్‌ లో అధికారికంగా చేరతానని ఆయన వెల్లడించారు. మతతత్వ పార్టీ అయిన బిజెపితో పొత్తుపెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి తాను దూరంగా వుంటానని ఆగా చెప్పారు.

తెలుగుదేశం మస్కతిని పట్టుకుంటే, ముస్లింలు మా వైపే వున్నారని చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ బాకర్‌ ఆగాను పట్టుకుందని పాతబస్తీ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతమంది నేతలు నిష్క్రమించినా మా విజయాన్ని ఎవరూ ఆపలేరని ఒవైసీ బృందం ధీమాతో వుంది. ఓటరు మనసులో ఏ ముందో 24న జరిగే కౌంటింగ్‌ లో కానీ తేలదు.

రాజమండ్రిలో కులమే ఆయుధం
రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్‌ షెడ్యూల్డు కులాలకు రిజర్వు చేయడంతో ఇక్కడ కులమే ప్రధాన అస్త్రంగా మారింది. అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్‌ నాయకులు రాజమండ్రి సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని హేమాహేమీలను రంగంలోకి దించారు.

కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ నుంచి జి.వెంకటస్వామి, హనుమంతరావుతో పాటు సీనియర్‌ నాయకులు రోశయ్య తదితరులను బరిలోకి దించింది. వీరంతా కులం ప్రాతిపదికగా ఓటర్లను బుట్టలో వేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నలుగురు మంత్రులును, పలువురు ఎమ్మెల్ల్యేలను రంగంలోకి దించింది. మంత్రి యనమల, కోటగిరి విద్యాధర రావు, పుష్పరాజ్‌ తదితరులు తమ కులాలకు చెందిన పెద్దలను కలుసుకొని తెలుగుదేశం గెలిస్తేనే మంచిరోజులు వస్తాయని నచ్చచెబుతున్నారు.

రాజమండ్రిలో కీలకపాత్ర వహించే వాణిజ్యవర్గాలను ప్రసన్న చేసుకొనే బాధ్యతను ఎమ్మెల్ల్యే అంబికా కృష్ణకు అప్పగించారు. ఆయన వాణిజ్య వర్గాలతో సమావేశం అవుతూ తెలుగుదేశం విజయం కోసం కృషి చేస్తున్నారు. అంటరానితనం, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా గద్దెనెక్కి ప్రసంగాలు చేసే రాజకీయనేతలు ఈ రోజున అదే కులం ప్రాతపదికగా ఓటర్లను ఊరించే ప్రయత్నాలు చేయడం రాజకీయ విచిత్రం.

తిరుపతిలో బాబు-వై.ఎస్‌. పోటీ!
తిరుపతిః తిరుపతి మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికలు తెలుగుదేశం సారధి చంద్రబాబు నాయుడుకు, సి.ఎల్‌.పి అధినేత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తిరుపతి చంద్రబాబు సొంత జిల్లాలో వున్న కీలక పట్టణం కాగా, తిరుపతి కాంగ్రెస్‌ అభ్యర్థి కరుణాకర్‌ రెడ్డి వై.ఎస్‌. కు అత్యంత ఆప్తుడు. దీంతో తిరుపతిలో ఎవరి పరువు నిలుస్తుందనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
నాలుగు రోజుల వరకు అసమ్మతి తో రగిలిపోయిన రెండు పార్టీలు ఇప్పుడు పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో ఆ సంగతిని పక్కన పెట్టి ప్రచారం పర్వాన్ని ఉదృతం చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తుడా మాజీ చైర్మన్‌ శంకర్‌ రెడ్డి బరిలో వున్నారు. బిజెపి అడ్డం తిరగడం, తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నేతలు మనస్పూర్తిగా మద్దతు ఇవ్వక పోవడంతో శంకర్‌ రెడ్డి నానా తంటాలు పడుతున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి కరుణాకర్‌ రెడ్డికి కూడా అసమ్మతి బెడద తప్పలేదు. తిరుపతి మునిసిపాలిటీ మాజీ ఉపాధ్యక్షుడు మబ్బు దేవనారాయణ రెడ్డి కాంగ్రెస్‌ పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చివరకు పార్టీ నుంచి ఆరేళ్ళపాటు బహిష్కారానికి గురయ్యారు. ఆయన స్వతంత్రఅభ్యర్థిగా బరిలోకి దిగుతుండడంతో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు కొన్ని చీలే ప్రమాదం ఏర్పడింది. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హేమా హేమీలు కరుణాకర్‌ రెడ్డికి మద్దతుగా నిలబడడం, తిరుపతిలో గత 36 సార్లుగా జరిగిన ఎన్నికల్లోల 35 సార్లు మున్సిపాలిటీని కాంగ్రెస్‌ పార్టీయే కైవసం చేసుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి ప్లస్‌ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. అయితే సొంతజిల్లాలోని తిరుపతిని చంద్రబాబు అంత తేలిగ్గా వదిలేస్తారను కోవడం పొరపాటేనేమో?!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X