అనుభవ శిల్ప,అభినయసిరి
మల్లెపువ్వును ఆరగించగానే పార్వతికి సద్యోగర్భం వచ్చి, తొమ్మిదో గడియకల్లా ప్రసవవేదన మొదలైందట. ఆ నెప్పులను భరించలేక వెంటనే శంకరుడికి చెప్పి తీసుకురమ్మని భవాని దాసీలను పంపిందట. కబురు వినగానే శివుడు అగ్గిరాముడై పార్వతి తలిదండ్రుల దగ్గరకి చర్రున పోయి మీ బిడ్డ నేను లేని సమయాన గర్భవతి అయింది. శిక్షించుతాను అని చెప్పి పార్వతి చెంతకు వెళ్ళాడట. నా యొక్క భామామణి, నేను లేని సంతు నీకెవ్వరిచ్చిరి అని గద్దించి, పార్వతి కాళ్లూ చేతులూ కట్టేసి, పల్లేరుకాయలు చల్లిన నేలమీంచి నడిపించుకుంటూ.... ఎనిమిది బండ్ల గంధపు చెక్కతో పేర్పించిన కాటి దగ్గరకి తీసుకుపోతాడు. పాదాలు నెత్తురోడుతుండగా చితి మీద పడుకోబెట్టి నిప్పంటిస్తే దుఃఖిస్తున్న పార్వతితో కడుపులో వున్న బిడ్డ అంటుందట -












Click it and Unblock the Notifications
