మారిన మనిషి
దేశం సంక్షోభంలో వున్నప్పుడు దేశాధినేత నుంచి ప్రజలు ఏమి ఆశిస్తారు. ఒక ధైర్యాన్ని, స్వాంతన గొలిపే నాలుగు మాటలను, సవాలును ఎదుర్కునేందుకు అవసరమైన ఉత్తేజాన్ని ఆశిస్తారు. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా నేతలనుంచి ప్రజలు దానిని ఆశిస్తే అది తప్పు కాదు. అదివారి హక్కు. దానిని అందించలేని నేతలు విశ్రాంతి గృహాల్లో హాయిగా సేదతీరాలను కుంటే అలాంటి బృహత్ బాధ్యతను మరో సమర్ధుడైన నేతకు అప్పగించడం ఉత్తమం. మామూలు అల్లాటప్పా సంస్థలే సంక్షోభంలో వున్నప్పుడు మంచి మానేజర్ అయినవాడు లేదా మంచి ఎండీ అన్నవాడు ఉద్యోగులతోనే వుంటూ వారిని ఉత్తేజితులను చేస్తూ సంక్షోభం గట్టెక్కే ప్రయత్నం చేస్తాడు.












Click it and Unblock the Notifications
