రక్షణ లేనిదే లక్షలు తేగలమా?
హైదరాబాద్‌ః భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టయిలిష్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ అజరుద్దీన్ మళ్లీ బ్యాట్ పట్టుకొని జింఖానా గ్రౌండ్స్ లో వీరవిహారం చేశాడు. అదేంటి.... మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జీవితకాల నిషేధానికి గురైన అజరుద్దీన్ మళ్ళీ మ్యాచ్ ఎలా ఆడాడని ఆశ్చర్యంగా వుంది కదూ............
అజరుద్దీన్ తన రెండో భార్య సంగీతా బిజలానీ తో సహా మొన్ని ఆదివారం లాలా గ్రౌండ్స్ చేరుకున్నాడు.........
పాలనురుగును తలదన్నే తెల్లటి దుస్తులు వేసుకొని బ్యాట్ పట్టుకొని చెలాకీగా చెలరేగి పోయాడు......
స్టేడియంలో వున్న అందరి కళ్ళూ అజర్ కదలికలమీదే వున్నాయి.....
జీవిత కాల నిషేధానికి గురైన తరువాత అంటే సుమారు ఆరు నెలల తరువాత అజర్ బ్యాట్ పట్టుకొని క్రికెట్ గ్రౌండ్ లోకి దిగడం ఇదే ప్రధమం. తనకు ఇష్టమైన ఆన్ డ్రైవ్ లు, స్వ్కేర్ డ్రైవ్ లు, చకచకా ఫ్లిక్ షాట్లు కొట్టిన అజర్ తనలో చేవ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.












Click it and Unblock the Notifications