వార్న్ కన్నా కుంబ్లే క్విక్
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నా భారత క్రికెట్ జట్టు లెగ్ స్పినర్ అనిల్ కుంబ్లే బంతిని క్విక్‌గా బౌల్ చేస్తాడట. దీని వల్లనే లెగ్ బిఫోర్ వికెట్ ( ఎల్బిడబ్ల్యు) ఇవ్వడం అంపైర్లకు కష్టంగా ఉంటోంది. ఎల్బిడబ్ల్యుకి కుంబ్లే చేసే అప్పీల్‌ను అంపైర్లు తరచుగా తిరస్కరిస్తుండడానికి కారణం ఇదేనట. ఈ మాటలన్నది ఎవరో కాదు, ఐసిసి ప్యానెల్ అంపైర్ సైమన్ టాఫెల్.
వార్న్ విసరే బంతిలో వేగం తక్కువగా ఉంటుందని, దాని వల్ల అంపైర్లు ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం చిక్కుతుందని, కుంబ్లే వేసే బంతి చాలా వేగంగా బ్యాట్ వైపు దూసుకెళ్తుందని, దాని వల్ల అంపైర్లు ఒక నిర్ణయానికి రావడం కష్టంగా వుంటుందని ఆయన చెప్పినట్లు ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక రాసింది.
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో పలు ఎల్బిడబ్ల్యు అప్పీళ్లను బియ్రాన్ జెర్లింగ్ తిరస్కరించడం పట్ల కుంబ్లే కాస్తా నిరాశకు లోనయ్యాడు. భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎల్బిడబ్ల్యులను ఎక్కువగా ఇవ్వడం పట్ల వెస్టిండీస్ క్రికెటర్లు నిరసన వ్యక్తం చేసినట్లు కూడా ఆ పత్రిక రాసింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు భారత్ బౌలర్ల చేతిలో 13 ఎల్బిడబ్ల్యు అవుట్లు అయ్యాయి. భారత బౌలర్లు స్టంప్‌లకు నేరుగా విసరడం వల్లనే ఎల్బిడబ్ల్యులు ఎక్కువగా రావడానికి కారణమని భావిస్తున్నారు.