బింద్రాకు సాటి ఎవరు?

2006 ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో అతను గోల్డ్ మెడల్ సాధించాడు. 2005 ఆసియా చాంపియన్ షిప్ పోటీల 10 మీటర్ల ఎయిర్ రైఫీల్ విభాగంలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. 2004 ఒలింపిక్స్ లో బింద్రా ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బింద్రా తన క్రీడా జీవితాన్ని 15 ఏళ్ల వయస్సులోనే ప్రారంభించాడు. వ్యక్తిగత కీర్తి కోసం ఏదైనా సాధించాలనే తపనే అతన్ని ఈ స్థాయికి చేర్చింది. అతను కఠోరమైన శిక్షణ పొందాడు. ప్రతి రోజూ ఏడు గంటలు షూటింగ్ చేస్తూ వస్తున్నాడు. రెండు గంటల పాటి స్ట్రెచింగ్, జాగింగ్ చేస్తాడు.
వ్యక్తిగత విభాగంలో భారత్ కు పతకాలు దక్కినప్పటికీ స్వర్ణపతకం మాత్రం బింద్రానే సాధించాడు. 1952లో ఫ్రీ స్టయిల్ వ్రెజలర్ ఖా సభా జాదవ్ బ్రాంజ్ పతకం సాధించాడు. టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ 1996లో బ్రాంజ్ పతకం సాధించాడు. వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో బ్రాంజ్ పతంక సాధించింది. షూటర్ రాజ్యవర్థన్ రాథోర్ నాలుగేళ్ల క్రితం ఏథెన్స్ లో వెండి పతకం సాధించాడు.












Click it and Unblock the Notifications