సినీ ప్రభావం ఎంత?

సినిమాల వల్లనే ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయని మహిళా సంఘాల నేతలు విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్లులో యాసిడ్ దాడిలో గాయపడిన స్వప్నిక, ప్రణీతలను పరామర్శించడానికి వచ్చినప్పుడు వారు చిరంజీవిపై ఇదే విమర్శ చేశారు. అయితే ఆ విమర్శను చిరంజీవి ఖండించారు. నిజానికి చిరంజీవి సినిమాలతోనే తెలుగు సినిమాల్లో మార్పులు ప్రారంభమయ్యాయి. నెగెటివ్ రోల్స్ ఆదరణ పొందడం మొదలైంది. యాంగ్రీ యంగ్ మెన్ పాత్రలు తెలుగులో కృష్ణంరాజు నుంచి మొదలైనప్పటికీ అవి ఊపందుకుంది చిరంజీవి సినిమాలతోనే. నాయికలు ఏడిపించి, తన వైపు తిప్పుకోవడమనే ధోరణి ఊపందుకుంది. అయితే ధోరణి అంతకు ముందు ఉన్నా ఇంత పెద్ద యెత్తున లేదు.

కాగా, ఇటీవలి కాలంలో మరీ దారుణంగా సినిమాలు టీనేజ్ ప్రేమను హీరోయిగ్గా చూపించడం మొదలైంది. కళాశాలల, పాఠశాలల వాతావరణంలో అధ్యాపకుల పరువు తేసేలా వ్యవహిరంచే హీరో పాత్రలను సృష్టిస్తూ ప్రేమ కథలను, ఆ ప్రేమ సాధనకు పోరాటాలను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుంటున్నారు. కొత్త బంగారు లోకాన్ని మహిళా సంఘాలు ఇటీవల ప్రధానంగా ఎత్తిచూపుతున్నాయి. తేజ సినిమాలు ఇందుకు శ్రీకారం చుట్టాయని చెప్పవచ్చు. ప్రేమ అనేది జయాపజయాలతో సంబంధం లేని ఒక మధురమైన అనుభూతి అనే విషయాన్ని విస్మరిస్తున్నారు. అదే సమయంలో పాత సినిమాల్లో ప్రేమ అంటే హృదయ సంబంధి అని చూపుతూ వచ్చారు. కానీ ఇప్పటి సినిమాలు శరీరాన్ని ప్రధానం చేసుకుంటున్నాయి. హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలకు, హీరోహీరోయిన్ల సెక్సీ దృశ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

సమాజంలోని అన్ని రంగాలు ఏదో మేరకు భ్రష్టు పట్టాయి. అదే క్రమంలో సినిమా రంగం కూడా భ్రష్టు పట్టింది. కానీ, మరీ దారుణంగా దిశానిర్దేశం లేని మసాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సినిమాలేమైనా విజయం సాధిస్తున్నాయా అంటే అదీ లేదు. హృదయానికి, సున్నితత్వానికి పెద్ద పీట వేస్తున్న సినిమాలు విజయాన్ని అందుకుంటున్నాయనే విషయం రుజువైనప్పటికీ నిర్మాతలు, దర్శకులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. శేఖర కమ్ముల తీసిన గోదావరి తదితర సినిమాలు ప్రేక్షకాదరణ పొందిన విషయాన్ని వారు పట్టించుకోవడం లేదు. సున్నితమైన మానవ సంబంధాలకు, పరస్పర అనురాగానికి ఆయన సినిమాలు ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రేమ అనేది సున్నితమైన వ్యవహారమే కాదు, జీవితంలో ఒక భాగం మాత్రమేనని, ప్రేమనే జీవితం కాదని కూడా శేఖర్ కమ్ముల సినిమాలు సందేశాన్నిస్తాయి.

సినీరంగం ప్రభావం తప్పకుండా సమాజంపై ఉంటుంది. ఉండదని చెప్పడానికి వీల్లేదు. సినిమాలు చూసి దొంగతనాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి మాటల్లో పూర్తి సత్యం లేదని మనం తప్పకుండా చెప్పవచ్చు. పుస్తకాల ప్రభావం కన్నా సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+