• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2010 - ఆంధ్రప్రదేశ్ రౌండప్ ఆఫ్ కిరణ్ కుమార్ రెడ్డి

By Srinivas
|

Kiran Kumar Reddy
సెప్టెంబర్

01- చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట కొత్త విమానాశ్రయానికి శంకుస్థాపన

- లాటరీల నిర్వహణపై హైకోర్టు నిషేధం

17- హజ్ యాత్రకు 17 లక్షల మంది భారతీయులకు అనుమతి

18- 20 రైళ్ల నెంబర్లను మార్చాలని నిర్ణయించిన రైల్వే శాఖ

29- తెలంగాణ ఉద్యమంలో ముందుండాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం

- ఖరీఫ్ పంట నష్ట నివారణకు రూ.699 కోట్లు విడుదలకు కేంద్రం ఆమోదం

30- ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబుకు యావజ్జీవ శిక్ష

ఆక్టోబర్

01- ఆర్జీత సేవా టిక్కెట్ల కుంభకోణంలో క్రిమినల్ కేసులు

- విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత హోంశాఖకు ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశాలు

- కాంగ్రెస్ పార్టీకి జగనే దిక్కు అంటూ మాజీ మంత్రి కొండా సురేశ వ్యాఖ్య

- అధికారికంగా బతుకమ్మ పండుగ నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం

- 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ గా తులసిరెడ్డి నియామకం

- తిరమల ఆలయంలో డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసిని టిటిడి ఇఒ కృష్ణారావు

- గుంటూరు డిఆర్సీలో మంత్రులను నిలదీసిన తెదేపా ప్రజాప్రతినిధులు

- సత్యం రాజు బెయిలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్

- 02- దేశవ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో రోబో విడుదల

- సిఆర్పీఎఫ్ డైరెక్టర్ గా విజయ్ కుమార్

- ఉద్యమాల నియంత్రణ, ఉపాధి అవకాశాల పెంపు ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన

- నిమ్స్ నుంచి రామలింగరాజు డిశ్చార్జ్

- తెలంగాణ కోసం మరో ఫ్రంట్, గద్దర్ ప్రత్యేక్ష కార్యాచరణ

- గిరిజనుల పోరాటానికి మద్దతునిస్తూ శ్రీకాకుళం పాలకొండలో సిపిఎం సమావేశం

03- ఇవిఎంలపై గళమెత్తిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పయనం

- హైదరాబాదును రెండవ రాజధానిగా ప్రజలు కోరుతున్నారంటూ జస్టిస్ సుభాషణ్ రెడ్డి వ్యాఖ్య

- శ్రీవారి హుండీలో బుల్లెట్.. రెండవ వైకుంఠం వద్ద భక్తులపై విజిలెన్సు దాడి

- సింహాచలం భూముల వేలంపాట నిలుపు చేయాలని ముఖ్యమంత్రిని కోరిన సిపిఐ రాఘవులు

- పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరెడ్డి హ్యాట్రిక్

04- ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ప్లీనరీపై పోలీసుల దాడి

- ఈవిఎంలపై చంద్రబాబు పోరాటానికి 26 పార్టీల మద్దతు

- 19.7 శాతం పెరిగిన రాష్ట్ర ఆర్థిక స్థితిపై ముఖ్యమంత్రి హర్షం

- ఒకే ఛత్రం కింద శ్రీవారి సేవలు

- 1900 బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయం

- సింగరేణి కార్మికులకు 16శాతం బోనస్

- రాష్ట్ర రాజధానిలో సుప్రీంకోర్టు బెంచ్ కోరుతూ సాధన సమితి ఆవిర్భావ ం

- రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఐదువేల రూపాయల జరిమానా

05- పిసిసి కార్యదర్శి శ్రీధర్ రెడ్డి సస్పెన్షన్... ప్రతాప్ రెడ్డికి షోకాజ్

- గజదొంగ అడపా వెంకన్న ఎన్ కౌంటర్

- రామలింగరాజును మూడుగంటలు విచారించిన సిబిఐ

- వైఎస్ జగన్, కెవిపిలపై చర్యలకు హైకమాండ్ కసరత్తు

- కొండా సురేశపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టాన వర్గానికి డిఎస్ నివేదిక

- ఒకే కాన్పులో నలుగురు కవలలు

- ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ నాదెండ్ల వెంకటేశ్వరరావు ఆత్మహత్య

- హైదరాబాదులో 2.15 లక్షల రూపాయల విలువైన కొకైన్ పట్టివేత

- స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 40శాతం సీట్లు కేటాయిస్తూ తెదేపా నిర్ణయం

- విద్యాసంస్థల బస్సులకు మరిన్ని కండిషన్స్ విధించిన ఆర్టీఐ

- తిరుపతిలో టిటిడి అధికారుల వైఖరికిని నిరసనగా మీడియా బృందం నిరవధిక ధర్నా

06- జాతీయ విపత్తుల నివారణ సంస్థ సభ్యుడిగా క్యాబినెట్ హోదాలో మర్రిశశిధర్ రెడ్డి నియామకం

- ఎమ్మార్ ప్రాపర్టీస్ 532 ఎకరాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల

- మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి రోశయ్య ఆగ్రహం

- గంగవరంలో ఉపాధికోసం ఉద్యమించిన మత్స్యకారులు

- చేనేత కార్మికుల రుణమాఫీ చేస్తూ క్యాబినెట్ నిర్ణయం

- ముఖ్యమంత్రిని కలిసిన ఆస్ట్రేలియా మేయర్ల ప్రతినిధి బృందం

- శబరిమల యాత్రకు వెయ్యి ప్రత్యేక బస్సులు

- ఉస్మానియా వర్సిటీకి స్లెట్ నిర్వహణ బాధ్యతను ఇస్తూ ప్రభుత్వ నిర్ణయం

- మావోల కోసం హెలికాపట్ర్లతో భద్రతా సిబ్బంది వేట

07- పౌరహక్కుల నేత శంకరన్ కన్నుమూత

- ప్రభుత్వ పాఠశాలలో బాలల ఆరోగ్య రక్ష కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశం

- బెల్టు షాపులపై తెదేపా మహిళా ఉద్యమం

- గాంధీ ఆసుపత్రిలో 22 సుశృత ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం

08- తెలంగాణ భవన్ ముట్టడికి అమరవీరుల ఐక్య వేదిక ప్రయత్నం

- భూదానం భూములను కాపాడేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని అఖిలపక్షాల డిమాండ్

- సచివాలయానికి కట్టుదిట్టమైన భద్రత

- ప్రారంభమైన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

9- శ్రీరాంసాగర్ జలాలు ఇవ్వాలంటూ పొన్నాల ఇంటి ముందు మోత్కుపల్లి ధర్నా

- తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా గద్దర్, 85 మందితో అడ్ హక్ కమిటీ

- శ్రీశైలం వద్ద లోయలో పడిన కాలేజీ బస్సు, ఇద్దరి మృతి

- బెల్టు షాపులపై తెదేపా రాష్ట్రవ్యాప్త ధర్నాలు

- మోక్రోఫైనాన్సుకు ముగ్గురు బలి

10- ఢిల్లీకి చేరిన ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గ విస్తరణపై చర్చ

- ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ రగడ.. 1.5 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

11- అనంతలో పడగ విప్పిన ఫ్యాక్షనిజం.. తెదేపా నేత హత్య

- అవినీతి మంత్రులను తొలగించాలని సోనియాకు రాయపాటి లేఖ

- రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్సు ఎరువుల సరఫరాకు అంగీకరించిన కేంద్రం

- అటవీ భూములను ఆక్రమిస్తే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన మంత్రి పెద్దిరెడ్డి

12- జగన్ అడ్వాన్సు టాక్సు 84 కోట్ల రూపాయలు

- మైక్రో ఫైనాన్సు సంస్థల ఆగడాలపై ఆర్డినెన్సుకు ప్రభుత్వం నిర్ణయం

- కనకదుర్గమ్మకు రెండు కేజీల బరువు ఉన్న బంగారు వీణ కానుక

13- ముఖ్యమంత్రిలో శ్రీకృష్ణ కమిటీ కార్యదర్శి దుగ్గల్ భేటీ

- గోపాల మిత్ర గౌరవ వేతనాలను పెంచిన ప్రభుత్వం

- మైక్రో ఆగడాలపై అఖిలపక్షాల ధ్వజం.. అరికట్టాలని ప్రభుత్వానికి నిన్నపం

14- మైక్రో ఫైనాన్సుపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లను ఆదేశించిన సిఎం

- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ల గల్లంతుపై విచారణ

- పశుక్రాంతి పథకం అమలుకోసం కమిటీ నియామకం

- సచివాలయం వద్ద డిఎస్సీ 2008 అభ్యర్థుల ఆందోళన, అరెస్టు

- ఓపెన్ మార్కెట్ విధానంలో మిల్లర్ మాఫియాకు చెక్ పెట్టేందుకు యత్నం

15- మైక్రో ఆర్టినెన్సుకు గవర్నర్ ఆమోదం, టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు

- శ్రీవారిని దర్శించుకున్న సిఎం

16- దళిత రిజర్వేషన్ల బిల్లుకు సిఫారసు చేసిన ప్రభుత్వం

- ఖమ్మం జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో లోయలో పడిన లారీ.. ఏడుగురు మృతి

- గ్రామాలకు పర్యాటక శోభ ఇచ్చేలా ప్రభుత్వ ప్రోత్సాహకాలు

17- ఆంధ్రప్రభ దినపత్రిక ప్రధాన కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రోశయ్య

- విశ్వసనీయ వార్తలకు ప్రతీక ఆంధ్రప్రభ అంటూ అభినదించిన సిఎం

18- ఏడాదిలోగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తామన్న కాకా

19- యూనివర్శిటీ ఆప్ హైదరాబాదు క్యాంపస్ లో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటరీ రీసెర్చ్ క్యాంపస్ కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్

- ప్రధాని అప్పాయింట్ మెంటు కోసం తెదేపా ధర్నా

- ఎమ్మార్ ప్రాపర్టీస్ కు రెండు నెలల గడువు ఇచ్చిన ఏపిఐఐసి

20- ఖమ్మంలో కానిస్టేబుల్ రైఫిల్ పేలి ఇద్దరు చిన్నారుల మృతి

- బియ్యం ఎగుమతికి అనుమతి నిరాకరించిన రోశయ్య

- అమరజవాన్లకు డిజిపి నివాళి

- మైక్రో ఆర్డినెన్సుపై రిట్ లను స్వీకరించిన హైకోర్టు

- స్వాతంత్ర్య సమరయోధుడు పాగ పుల్లారెడ్డి కన్నుమూత

21- తెలంగాణ అంశం వీధుల్లో తేలేది కాదన్న ముఖ్యమంత్రి

- ఏడాదిలో లక్షన్నర ఐటి ఉద్యోగాలు వస్తాయని ఇన్ఫోసిస్ సిఈవో గోపాలకృష్ణన్

- సచివాలయం వద్ద డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన అరెస్టు

- ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఆధ్వర్యంలో ఐ బ్యాంకు

- రైళ్లకు కొత్తగా ఐదు అంకెల నెంబర్లు

- సిఎంను కలిసిన కేంద్ర ఆహార, పౌరసరఫరల శాఖ సహాయమంత్రి కెవి ధామస్

22- స్థానకి సంస్థల మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గుంటూరులో ప్రకటించిన ముఖ్యమంత్రి

- మైక్రో లావాదేవీలకు అనుమతినిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

- ఎస్కెయు విసి కుసుమ కుమారిని తొలగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు

- ఉన్నత విద్యకు అదనంగా 32 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం

23- మహబూబ్ నగర్ లో తెలంగాణ అమరవీరుల రభ రసాభాస

- తెలంగాణకు సోనియా అనుకూలమే అంటూ కాంగ్రెస్ నేతల ఉద్ఘాటన

- యువతను రాజకీయాల్లోకి అహ్వానించిన చంద్రబాబు

- విజయవాడ పర్యటన రద్దు చేసుకున్న ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి

లలిత కళాతోరణం పేరు మార్పు యోతనను విరమించుకున్న ప్రభుత్వం

24- కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో భారత ఆర్చరీ కోచ్ లెనిన్ సహా తొమ్మిది మంది దుర్మరణం

- హైదరాబాదులో లేడీస్ హాస్టల్ లో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి

- ఆహార భద్రత పథకాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి

- భూ వివరాలను సేకరించిన శ్రీకృష్ణ కమిటీ

- ఢిల్లీకి వెళ్లిన డిఎస్

- సమ్మె విరమించిన మిల్లర్లు

- గాంధీలో దీక్ష చేస్తున్న డిఎస్సీ అభ్యర్థులు క్షీణిస్తున్న ఆరోగ్యం

- తిరుమలలో సామాన్య భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యమని వెల్లడించిన సిఎం

25- తెలంగాణ కోసం ఢిల్లీలో తెదేపా ధర్నా, అరెస్టులు

హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదులు చేస్తున్న దీక్ష భగ్నం

- ప్రాణహిత పుష్కరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతాయన్న మంత్రి గాదె వెంకటరెడ్డి

- ఆర్టీసీలో 30,849 పోస్టుల భర్తీ చేస్తామని ఎండి ప్రసాదరావు వెల్లడి

- పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించిన ముఖ్యమంత్రి

26- శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

- సత్యం రాజుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేసిన సుప్రీం

- ట్రిపుల్ ఐటి ప్రవేశాలపై మండల్ యూనిట్ గా తీసుకోవడం రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు సంచలన తీర్పు

- యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు ఇంట్లో ఐటి అధికారుల సోదాలు

- ఓబుళాపురం నుంచి ఐరన్ ఓర్ సరఫరాపై జిటెక్స్ సంస్థ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

- చిత్తూరులో విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

- స్కాలర్ షిప్ దరఖాస్తులకు నోటరీ రద్దు చేసిన ప్రభుత్వం

27- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా భన్వర్ లాల్

- విసిల నియామకానికి కొత్త ఆర్డినెన్సు తీసుకు వస్తామన్న గవర్నర్

- 2013లో అంతరిక్షంలోకి చంద్రయాన్-2ను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడి

28- వేత సవరణ కోసం అర్చకుల ఆందోళన

- 70:30 నిష్పత్తిలో డిఎస్సీ-2008 నియామకాలు చేస్తామని ప్రకటించిన మంత్రి మాణిక్య వరప్రసాద్

- రాష్ట్ర పరిస్థితులపై తాజా నివేదికతో ఢిల్లీకి వెళ్లిన గవర్నర్

- మెట్రో రైలు ప్రాజెక్టును సకారంలో పూర్తి చేయాలని సిఎం ఆదేశాలు

29- డిఎస్సీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

- తెలుగు యూనివర్శిటీలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు

- అలిపిరి దాడి కేసులో మావో ముద్దాయిలకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు

- పారిశ్రామికాభివృద్ధి దిశగా రాష్ట్రం ప్రగతి సాధిస్తున్నదని ముఖ్యమంత్రి వెల్లడి

30- ఉన్నత విద్యామండలి పూర్తి కాలపు చైర్మన్ గా జయప్రకాశ్ రావు

- ఈశాన్య రుతుపవనాల ఆగమనం.. భారీ వర్షాలు

- ఆర్టీసీలో 419 సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- ఖైదీల విడుదలకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు

31- కోస్తాతీరం అతలాకుతలం ఏడు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం

- ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవాలకు దూరంగా ఉండాలని తెరాస నిర్ణయం

నవంబర్

01- తెలంగాణలో నిరసనల హోరు, సీమాంధ్రలో వేడుకల జోరు మధ్య రాష్ట్రావతరణ దినోత్సవం

- రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఇంటిపై దాడి

- ఉగ్రవాదుల సవాళ్లను తిప్పికొట్టాలని యువతకు గవర్నర్ పిలుపు

- డిఎస్సీపై కోర్టుకెక్కిన బీఇడి అభ్యర్థులు

02- జడ్చర్లలో వందకోట్ల రూపాయల వ్యయంలో ఎస్ఎంఐఎంఎస్ బిజినెస్ స్కూలు ఏర్పాటు

- గజల్స్ గానంతో మూడోసారి గిన్నిస్ లోకి శ్రీనివాస్

- ప్రతి పౌరునికి ఓటరులు గుర్తింపు కార్డు ఇస్తామని సిఇవో భన్వర్ లాల్ వెల్లడి

- విద్యామండలి వైస్ చైర్మన్ మూలవేతనం మూడురెట్లు పెంచిన ప్రభుత్వం

03- ముంచుకొస్తున్న జల విలయం.. కోస్తా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు

- తుఫాన్ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలన్న సిఎం

- ఓడరేవుల అభివృద్ధికి మెరీటైమ్ బోర్డు ఏర్పాటు, జిహెచ్ఎంసీ పరిధిలో క్రిమీలేయర్ వర్తించకుండా చట్ట సవరణ, మైక్రో రుణాలపై బిల్లు తీసుకు రావాలని క్యాబినెట్ నిర్ణయాలు

- ప్రారంభమైన డిఎస్సీ నియామకపు ప్రక్రియ

- మంత్రులు ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు లీక్ చేస్తున్నారని మండిపడ్డ సిఎం

- నల్లమలలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

04- ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి

- కోస్తాలో జలఖడ్గం దాటికి 38 మంది మృతి.. 3 లక్షల హెక్టార్లలో పంట నష్టం

- ప్రత్యేక పోలీసు ఆఫీసర్లుగా మాజీ సైనికులను నియమించాలని ప్రభుత్వ నిర్ణయం

05- వరదలతో కోస్తా తీర ప్రాంతాలు అస్తవ్యస్తం

- పోలీసుల అదుపులో పోతుల సురేష్

- రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

06- శాస్త్ర సాంకేతిక మండలికి 300 కోట్ల అదనపు నిధులు ఇచ్చేందుకు సిఎం అంగీకారం

- వరద ప్రాంతాల్లో తెదేపా నేత చంద్రబాబు పర్యటన

- బోగస్ కళాశాలలపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం

07- రాష్ట్రానికి తప్పిన జల్ గండం, చెన్నై ఉత్తర తీరాన్ని తాకి బలహీన పడిన తుఫాను

- ఆటోమోబైల్, స్టీల్, కెమికల్స్ ప్లాంటులకు భూములిస్తామని రతన్ టాటా కు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రోశయ్య

- తన సహనాన్ని పరీక్షించవద్దని నెల్లూరు సభలో వ్యాఖ్యానించిన వైఎస్ జగన్

08- వరద పీడిత ప్రాంతాల్లో పంటరుణాల రీషెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం

- రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలని చంద్రబాబుకు సూచించిన రోశయ్య

- వీసీల వేటలో గవర్నర్

- హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల బంద్

- బంగారు సరికొత్త రికార్డు 20,335

- అల్పపీడనంగా మారిన జల్ తుఫాను

- ఉద్యోగ భద్రత కల్పించాలని వరంగల్ లో నర్సుల సమ్మె

09- వరద ప్రాంతాల్లో పర్యటించిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి

- తూర్పు గోదావరి జిల్లాలో పేలిన ఓఎన్జీసి పైప్ లైన్

- కర్నూలు జిల్లా ఆత్మకూరులో మిద్దెకూలి ఐదుగురి మృతి

- రామలింగరాజుకు సుప్రీం కోర్టులో చుక్కెదురు, లొంగిపోవాలని ఆదేశం

- హార్టికల్చర్ కాలేజీలకు నాబార్డు నిధులు

10- మళ్లీ రాజుకున్న ఫ్రీజోన్ వివాదం

- పల్లెలకు ఐటి సేవలు విస్తరించాలని ప్రభుత్వ నిర్ణయం

- ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానం ప్రవేశపెడుతూ ఇంటర్మిడియట్ బోర్డు నిర్ణయం

- హైకోర్టు ఆవరణను హై సెక్యురిటీ జోన్ గా ప్రకటించిన హైకోర్టు

- మొద్దుశీను హంతకుడు ఓంప్రకాశ్ కు జీవిత ఖైదు విధించిన అనంతపురం సెషన్సు కోర్టు

- లొంగిపోయిన సత్యం రామలింగరాజు, ఐదుగురు నిందితులు

- అడపా వెంకన్న హత్యకేసులో న్యాయవిచారణకై హైకోర్టు స్టే

11- తెలంగాణ కోసం కాంగ్రెస్ ను బలోపేతం చేస్తూ, జనవరి నెలాఖరు వరకు గడువు ఇస్తామన్న కెసిఆర్

- 8 మంది ఐఏఎస్ ల బదిల

- ఫిలిం టూరిజం సెల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

- చంద్రుడిపై పూర్తిస్థాయిలో పరిశోధనకు ఇస్రో సన్నాహాలు

12- లార్జెస్టు బేర్ ఫుట్ వాక్ లో పాలమూరు వర్సిటీ గిన్నిస్ రికార్డు

- సోనియాకు మద్దతుగా పిసిసి భారీ ధర్నాలు.. పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య

- రోడ్లు, మంచినీటి పునరుద్ధరణకు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం

13- సినీ భీష్ముడు డివిఎస్ రాజు మృతి

- విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న లోక్ సభ స్పీకరు మీరా కుమార్

- తెలంగాణ కోసం అవసరమైతే పదవులు త్యాగం చేస్తామని ప్రకటించిన కెకె

14- బాలల ఆరోగ్యానికి బాల ఆరోగ్య రక్షణ పథకం ప్రారంభించిన ప్రభుత్వం

- ఏషియాడ్ లో బంగారు పథకాలు సాదించిన రాష్ట్ర క్రీడాకారులు

- మాజీ మంత్రి దండు శివరామరాజు మృతి

15- ఎస్ఐ పరీక్షలపై రగడ... డిజిపి కార్యాలయం ముట్టడి

- పోలవరంపై ఎంపీల గోల... నేదురుమల్లి ఇంట్లో తెలంగాణ, సీమాంధ్ర నేతల రభస

- పద్మ అరెస్టుతో అట్టుడికిన మన్యం

- మార్చి 15 తర్వాత ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం

- కాకినాడ కేంద్రంగా భారీ చెరుకు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన అమెరికా సంస్థ

- రోశయ్య అభిమానులచే రోస్ సంస్థ ఏర్పాటు

- 294 కోట్లతో రోడ్లు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం

- అటవీశాఖలో 517, కాలుష్య నియంత్రణ బోర్డులో 128 పోస్టుల భర్తీకి అంగీకరించిన సిఎం

16- ఎస్ఐ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం.. ఉస్మానియాలో ఉద్రిక్తత

- నవరత్నాల్లో విశాఖ ఉక్కు

- అవినీతిపరులను కఠినంగా శిక్షించాల్సిందే అని కాగ్ కు గవర్నర్ కితాబు

17- తిరుపతి పర్యటనలో సిఎం, పరిస్థితుల కారణంగా సహనం కోల్పోతున్నా అన్న సిఎం

- తీరంలో మళ్లీ తుఫాను అలజడి

- పోలవరంగా ఢిల్లికీ వెళ్లాలని చిరంజీవి నిర్ణయం

- మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లో గీత కార్మికుడి లాకప్ డెత్

18- ఎస్ఐ పరీక్షల నిర్ణయం భగ్గుమన్న ఓయు

- మే మొదటివారంలో ఎంసెట్ నిర్వహణ, జెఎన్టీయుకే బాధ్యతనిచ్చిన ఉన్నత విద్యా మండలి చైర్మన్

19- పుట్టపర్తికి వచ్చిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

- ఎస్ఐ రాత పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం

- పార్టీయే సుప్రీం అంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి

- పేదల సంక్షేమమే కాంగ్రెస్ ద్యేయమని గుంటూరు సభలో వెల్లడించిన సిఎం

- 14మంది డిఎస్సీల బదలీ

- తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ

- 38 పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులకు ప్రిన్సిపల్స్ గా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం

20- సోనియాపై సాక్షి పత్రికలో కథనాలు, ఖండించిన కాంగ్రెస్ వర్గాలు

- త్వరలో ఎస్ఐ పరీక్షలు నిర్వహిస్తామని హోంమంత్రి హామీ

- మార్చి 7 నుంచి ఇంటర్, 24నుంచి పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధమైన ప్రభుత్వం

- మక్కా పేలుళ్ల నిందితుడు అసిమానందకు రిమాండ్

21 విజయవాడలో ఆర్యవైశ్యుల మహా సమ్మెళనం, పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య

- రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు

- రాష్ట్ర జనాభా 9 కోట్లకు చేరుకున్నదని తాజా నివేదికల వెల్లడి

22- సత్యసాయి జన్మదినోత్సవ వేడుకల్లో ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు

- పుట్టపర్తిలో సిఎంను అడ్డుకున్న జగన్ మద్దతుదారులు.. నేను రాజీనామా చేస్తే కడుపు మంట చల్లారుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం

- సీమలో చంద్రబాబు పర్యటన

- జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ఊహాగానాలు

- తెదేపా ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు

23- పుట్టపర్తినుండి నేరుగా ఢిల్లీకి వెళ్లిన రోశయ్య

- ఢిల్లీ టుర్ లో చంద్రబాబు, చిరంజీవి

- డిజిపి నియామకాన్ని తప్పు పట్టిన హైకోర్టు

- గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

- ఉద్యోగ సంఘాల చలో హైదరాబాద్

24- అత్యవసరంగా సిఎల్పీ సమావేశం, మొయిలీ, ఆజాద్ హాజరు

- ముఖ్యమంత్రి రోశయ్య రాజీనామా

- కొత్త ముఖ్యమంత్రిగా స్పీకర్ ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక

25- రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం

- రోశయ్య పథకాలు అమలు చేస్తానని కొత్త ముఖ్యమంత్రి వెల్లడి

- జగన్ ఇంట్లో మంత్లు, ఎమ్మెల్యేల భేటీ

- శాంతి, భద్రత, అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తామన్న కిరణ్

26- ఐఎఎస్ లో ముఖ్యమంత్రి ముఖాముఖి

- మెదక్ జిల్లాలో ఫారెస్టు బీట్ అధికారి సజీవ దహనం

- 568 మంది జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతి

27- ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

- జగన్ పై చర్యకు క్రమశిక్షణా సంఘం సిఫారసు

- అత్యవసర సమయంలో ఆదుకునేలా కొత్త బ్లడ్ పాలసీని ప్రారంభించిన ప్రభుత్వం

- టెక్సుటైల్ రంగంలో ఐదులక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి పనబాక లక్ష్మి

28- సోనియాతో వైఎస్ వివేకా భేటీ.. మంత్రి పదవి కావాలని వినతి

- కొత్త క్యాబినెట్ పై సిఎం కసరత్తు

- సలహాదారు పదవికి రాజీనామా చేసిన కెవిపి

29- కాంగ్రెస్ పార్టీకి జగన్, విజయమ్మల రాజీనామాలు, సోనియాకు ఐదు పేజీల బహిరంగ లేఖ

- ఫ్యాక్సు ద్వారా అందిన రాజీనామాలను ఆమోదించమని స్పష్టం చేసిన స్పీకరు కార్యాలయం

30- వైఎస్ జగన్ తో వైఎస్ వివేకా చర్చలు, కుదరని సయోధ్య

- మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవ్వాలని కెసిఆర్ పిలుపు

- సిఎంఓలో కిరణ్ కొత్త టీమ్

డిసెంబర్

17- రైతుల కోసం చంద్రబాబునాయుడు నిరవధిక నిరాహార దీక్ష

21- రైతుల కోసం జగన్ 48 గంటల దీక్ష

22- దీక్ష విరమించిన జగన్

24- చంద్రబాబు దీక్షను విరమించాలని కోరిన జాతీయ పార్టీ నేతలు

- దీక్ష విరమించిన చంద్రబాబు

25- క్రిస్ మస్ పండుగ సందర్భంగా కేకు తినిపించుకున్న బాబాయ్ వివేకానంద, అబ్బాయ్ జగన్

26- బాబాయ్, అబ్బాయ్ ల మధ్య కుదరని సయోధ్య

1 | 2 | 3

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more