ధోనీ సేనపై అంపైర్ల కక్ష

తర్వాత కార్తీక్ కీపర్ క్యాచ్ కూడా సందేహాస్పదమే. బంతి బ్యాట్ కు తాకినట్లు శబ్దమేదీ రాలేదని వ్యాఖ్యాతలు స్పష్టం చేశారు. రైనా, యువరాజ్ లైతే నిస్సందేహంగా నాటౌట్. బంతి రైనా బ్యాట్ కు తగలకున్నా, అప్పీల్ చేయగానే ధర్మసేన ఔటిచ్చేశాడు. యువరాజ్ ప్యాడ్ ను తగిలిన బంతి ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా రవూఫ్ వేలెత్తేశాడు. మ్యాచ్ లో మరికొన్ని నిర్ణయాలు సందేహాస్పదమయ్యాయి. రోహిత్ ఎల్బీ నిర్ణయం సరైందే అయినా, బౌలర్ అప్పీల్ చేయకుండానే రవూఫ్ వేలెత్తేశాడు.
రైనా అవుట్ ఇచ్చినప్పుడు బంతి బ్యాట్ కు తగిలిన శబ్దమేదీ వినిపించలేదని వ్యాఖ్యాతల బాక్స్ నుంచి అరుణ్ లాల్ వ్యాఖ్యానించాడు. అతని సహ వ్యాఖ్యాత రనిల్ అబే నాయక్ భారతీయలు దురదృష్టవంతులని వ్యాఖ్యానించారు. అంపైర్ల చెడు నిర్ణయాల వల్ల భారత్ కు నష్టం జరిగిందని, కానీ ఏం చేస్తామని ఆయన అన్నారు. తమకు న్యాయం జరగలేదని ఏ సైడ్ అయినా భావిసల్తే రెఫరల్ సిస్టమ్ ఉందని మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ సంగక్కర అన్నారు. ఇక్కడ భారత్ జట్టును ఎక్కువ చేయడం గానీ శ్రీలంక జట్టును తక్కువ చేయడం గానీ అవసరం లేదు. కానీ తటస్థ నిర్ణయాలు తీసుకోవాల్సిన అంపైర్లు అన్యాయంగా వ్యవహరించడం క్రీడాస్ఫూర్తిని దెబ్బ తీస్తాయి.
రోహిత్ శర్మ అవుట్ ను మినహాయిస్తే, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, రైనా కూడా భారత్ కు మేటి ఆటగాళ్లే. జయాపజయాలు సాధారణంగా వారి ఆట మీదనే ఆధారపడి ఉంటాయి. సెహ్వాగ్ పరుగుల వరద పారించేవాడే. యువరాజ్ కూడా అంతే. రైనా భారత విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఇక, ఆ ముగ్గురు అంపైర్ల అన్యాయానికి బలైన తర్వాత భారత్ ఓడిపోక ఏమవుతుంది.












Click it and Unblock the Notifications