అల్లం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే .. అయితే తాజా అధ్యయనాలు అల్లం మరింత మేలు చేస్తుందని సూచిస్తున్నారు. క్యాన్సర్ భారిన పడి కీమో థెరపీ చేయించుకున్నవారికి అదనంగా కలిగే చెడు ఫలితాల నుంచి అల్లం ఉపశమనం కల్పిస్తుందని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎమ్ఎస్) పరిశోధనలో తెల్చింది. కీమో థెరపీ చేయించుకున్నక్యాన్సర్ రోగులకు తరచూ వాంతులు, వికారం వంటి లక్షణాలు తరచూ బాధిస్తుంటాయి. అయితే ఈ రకంగా భాదపడుతున్న రోగలతో అల్లం పొడి వాడించినప్పుడు ఫలితం కనపడిందని ఏఐఐఎమ్ఎస్ అధ్యయన విభాగం అదనపు ఆచార్య సమీర్ బక్షి తెలిపారు.అల్లం వాడకం వాంతులు, వికారాలు మటుమాయమవుతాయని బక్షి వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించి 60 మంది రోగులకు పైగా పరీక్షలు జరిపి ఓ నిర్థారణకు వచ్చామని వారు తెలిపారు. అల్లం పోడితో తయారు చేసిన మాత్రలను రోగుల బరవును బట్టి వేరు వేరు డోసుల్లో రోగులకు అందించాలిని వీరు నిర్థారించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
Allow Notifications
You have already subscribed