వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాస్పిటల్స్ లో అధికమైన సీజనల్ వ్యాధులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Viral Infections
దగ్గులు, తుమ్ములు, కొద్దిపాటి జ్వరమా ? వైరల్ వ్యాధులు సోకకముందే, వెంటనే డాక్టర్ని సంప్రదించండి ! వైరల్ సంబంధిత వ్యాధుల సంఖ్య గణనీయంగా అధికమైనట్లు ఆస్పత్రుల రికార్డులు చూపుతున్నాయి. పేడియాట్రిక్ పల్మనాలజిస్ట్ డా.హెచ్ పరమేష్ మేరకు హాస్పిటల్స్ కు వచ్చే కేసుల్లో 50 నుండి 60 శాతం వరకు జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు మాత్రమే. జూన్ - సెప్టెంబర్ నెలల మధ్య ఈ రకమైన వైరల్ జబ్బులు సాధారణమే. దగ్గు లేదా తుమ్ము వచ్చినపుడు బాధితులు తగిన జాగ్రత్తలు పాటించి పక్కనవున్న వారికి అవి వ్యాపించకుండా చూడాలి. సాధారణంగా జూన్ నెలలో స్కూళ్ళు తెరిస్తే చాలు ఈ రకమైన వైరల్ వ్యాధులు సోకుతుంటాయి. అయితే, ఈ సీజన్లో వాటి పెరుగుదల ప్రమాదకరంగా లేదు గానీ కొంతమేరకు అధికంగానే వుందని కూడా వైద్యులు చెపుతున్నారు.

చాలామంది రోగులు దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్ళు నొప్పులు, కొద్దిపాటి జ్వరం అంటూ వారి వద్దకు వస్తున్నట్లు చెపుతున్నారు. ఈ వ్యాధులు చాలావరకు పారాసిటమాల్ టాబ్లెట్ వాడకం, ద్రవపదార్ధాలను సేవించడం వల్ల నియంత్రించవచ్చు. అత్యవసరమైతే తప్ప యాంటీబయోటిక్స్ వాడవద్దని, ఈ రకమైన అసౌకర్యాలు ఒకటి లేదా రెండు రోజులలో తగ్గిపోగలవని కూడా డాక్టర్లు చెపుతున్నారు.

English summary
Most of these cases get better with paracetamol and proper administration of fluids. Patients should not depend on antibiotics unless absolutely necessary. These infections can get better in a couple of days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X