వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ గడియ కోసం ప్రతి భక్తుడు నిరీక్షిస్తాడు..

|
Google Oneindia TeluguNews

Kailash Mansarovar
పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలన్న తనప ప్రతి హిందువులోనూ కొలువై ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనలో కొలువు తీరే ఆ మధుర గడియల కోసం ఎన్నాళ్లయినా నిరీక్షిస్తుంటాడు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మనససరోవర యాత్ర ఓ అద్భుతం. అంతటి గొప్ప విశిష్టత ఉన్న మానస సరోవర యాత్రకు ఇది అనువైన సమయం. మానస సరోవరం ఒడ్డును అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు కొలువుతీరి ఉన్నాయి. ఇక ఆ ప్రాంతాన్ని అనుకొని ఉన్న కైలాసపర్వతం బంగారు వర్ణాన్ని పూసుకుని కనుల విందు చేస్తుంది.

కర్నాలి, బ్రహ్మపుత్ర, సట్లెజ్, ఇండూస్ నదులకు జన్మస్థలంగా ఉన్న మానస సరోవరం సముద్ర మట్టానికి 4556 మీటర్ల ఎత్తులో ఉంది.మానస సరోవరం పడమటి వైపు రక్షస్తలి సరస్సు, ఉత్తరం వైపు కైలాస శిఖరం ఉంది. ఈ ప్రాంతంలో శ్వాస తీసుకోవడం కాస్త కష్టం అయినప్పటికి.. ఉమాశంకరుడి దర్శనానికి పరితపించే మనస్సు అలాంటి సమస్యలను లెక్కచేయకుండా చేస్తుంది. ప్రపంచంలో కల్లా ఎత్తైన స్వచ్ఛమైన నీటి జలపాతంలో స్నానం చేసినా, ఆ నీటిని తాగినా తమ పాపాలు పటాపంచలవుతాయని భక్తలు నమ్మకం. ఈ ప్రాంతంలో ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య బ్రహ్మి ముహుర్తంలో భోలా శంకరుడు స్నానం చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

చైనా, టిబెట్ దేశాలో పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి యత్ర చేయటమే ఓ గొప్ప అనుభూతి, భారత్, నేపాల్ తో పాటు అనేక దేశాల నుంచి హిందువులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకుంటారు. మానస సరోవరానికి సమీపంలో కొలువుతీరిన ముక్తినాథ్ వద్ద 108 జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంతో సహా ఎన్నో పర్వతాలను వీక్షించడం మాటలకందని మధురానుభూతి.

ఎన్నో విశిష్టతలు ఇమిడి ఉన్న ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో మానవ మేథస్సుకు అర్థంకాని విషయాలు దాగి ఉంటాయి. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తుడు ఒక విచిత్రమైన అనుభూతితో తిరిగి వస్తాడు. ఈ ప్రాంతంలో పర్యటించినప్పడు ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం తమకు కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

English summary
This region is steeped in religion and mythology and every year hundreds of pilgrims traverse some of the remotest and toughest regions of the Himalayas to pay their obeisance to the Lord. It is a land where Lord Shiva lives with his consort Parvati. According to ancient religious texts, the abode of creator Brahma is called Brahmaloka, the abode of Lord Vishnu is called Vaikunta and the abode of Lord Shiva is called Kailash. Of the three, one can only go bodily and return in this life from Kailash having experienced divinity. .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X