వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పేలుళ్లు: భారత్ రోజురోజుకీ బలహీనపడుతోందా?

By బిజి మహేష్
|
Google Oneindia TeluguNews

Mumbai Blast
జులై 13వ తేదీ ముంబైలోని మూడు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లపై మా మొబైల్స్‌లో ఎస్ఎంఎస్‌లు వరదలెత్తాయి. ముంబైలోని ఒపెరా హౌస్, దాదర్, జవేరి (ప్రసిద్ధ వజ్రాల మార్కెట్)ల్లో పేలుళ్లు సంభవించాయి. ఇది ముంబైలో నాలుగో అతి పెద్ద పేలుళ్ల సంఘటన. మొదటిది - 1003 మార్చి 12వ జరిగింది. పాకిస్తాన్ అధికారిక అతిథి దావూద్ ఇబ్రహీం ఈ సంఘటన వెనక ఉన్నాడు. రెండోది - 2006 మార్చి 12వ తేదీన ఏడు స్థానిక రైళ్లలో వరుస పేలుళ్లు జరిగాయి. మూడోది అత్యంత దారుణమైంది - 2008 నవంబర్ 26వ తేదీన మూడు రోజుల పాటు ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 166 మంది మరణించారు. 2008 దాడులకు పాకిస్తాన్ అధికారిక శాఖ ఐఎస్ఐ పథకం రచించింది. 13వ తేదీన జరిగిన వరుస పేలుళ్లతో పాటు ముంబై పలు దారణ ఉగ్రవాద దాడులను కూడా చవి చూసింది.

బుధవారం జులై 13వ తేదీన జరిగి పేలుళ్ల వెనక ఎవరున్నారనేది మనకు ఇప్పటి వరకు తెలియదు. ప్రధాన అనుమానితులు ఎవరనేది మన ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఎవరి వైపు కూడా వేలెత్తి చూపలేం. ఇప్పటికిప్పుడైతే ఇండియన్ ముజాహిదీన్ వైపు చూపిస్తున్నారు, వివరాలు తెలియాల్సి ఉంది. ఏ గ్రూపు కూడా ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. అయితే, దానికి రెండు రోజుల ముందు సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఐఎస్ఐ చీఫ్ జనరల్ పాషా వాషింగ్టన్ డిసికి వెళ్లాడు. ముఖ్యంగా భారత్, సహజంగా ప్రపంచ పౌర సమాజం వాషింగ్టన్ పాష్ బుద్ధిని మరల్చడానికి ప్రయత్నించాలని కోరుకుంటాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం బాడీ లాంగ్వేజ్ ఆహ్వానించదగింది. 26/11 దాడుల సమయంలో కన్నా పరిస్థితిని ఇప్పుడు సమర్థంగా చక్కబెట్టారు.

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు - పి. చిదంబరం హోం శాఖ నుంచి తప్పుకోవాలని అనుకున్నారు. 26/11 దాడుల తర్వాత హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన చిదంబరానికి తొలిసారి సవాల్ ఎదురైంది. హోం మంత్విత్వ శాఖకు చిదంబరం సరైనవారని భారతీయులు ఇప్పటికీ భావిస్తున్నారు. జాతీయ భద్రతా బలగాలు 24x7 కాల్‌పై అందుబాటులో ఉంటాయని, భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెంటనే తరలిపోతాయని 26/11 దాడుల తర్వాత చెప్పారు.

బుధవారంనాడు మొదటి పేలుడు 6 గంటల 45 నిమిషాలకు సంభవించింది. ముంబై ఎన్ఎస్‌జి హైదరాబాదు, ఢిల్లీల నుంచి ముంబైకి బయలుదేరుతున్నాయని రాత్రి 9 గంటల వరకు టీవీల్లో వార్తలు చూస్తూనే ఉన్నాం. అంటే, మనం తాబేలులా నడుస్తున్నామని అర్థం కావడం లేదా? ఏమైనా, ఎన్‌ఎస్‌జి తమ కేంద్రాల నుంచి కదిలాయి. ఉగ్రవాదులను ఎలా అదుపు చేస్తారనే విషయంపై ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. వారి వ్యూహాన్ని అంగీకరిస్తాం. లేకపోతే భారతీయులు ఆందోళన చెందాల్సి ఉంటుంది.

భారతీయులు బలహీనులు కారు, మన రాజకీయ నేతలే...

1. పాకిస్తాన్ 2001 డిసెంబర్‌లో మన ప్రజాస్వామ్య గుండెకాయపై దాడి చేసింది. భారత పార్లమెంటుపై దాడి చేసిన పార్లమెంటును కాపాడుతున్న పోలీసులను చంపింది. మనం ఎవరు కూడా అమరులైన పోలీసుల కుటుంబాలను పట్టించుకోలేదు. ఇది కఠినమైన నిజం. ఓ రాజకీయ నాయకుడో, నాయకురరాలో చనిపోతే దేశవ్యాప్తంగా అతను లేదా ఆమె విగ్రహాలను నెలకొల్పుతూ పోతుంటాం.

ప్రధాన నిందితుడు అఫ్జల్ గురు ఢిల్లీలోని జైలులో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనను జమ్మూ కాశ్మీర్ జైలుకు మార్చాలని దరఖాస్తు కూడా చేసుకున్నాడు. మన వ్యవస్థ ఇటువంటి విజ్ఞపులను ప్రోత్సహిస్తుంది? మన రాజకీయ వ్యవస్థ అఫ్జల్ గురును ఉరితీయడాన్ని అడ్డుకుంటోంది. మన వోటు బ్యాంక్ రాజకీయాలను అభినందించాల్సిందే. ఇది అన్ని రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది.

2. 2009 నవంబర్‌కు వస్తే, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ముంబైలోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్లపై, రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టర్మినెస్ (సిఎస్‌టి)పై దాడులు చేశాయి. సహాయక చర్చలను టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. మన సాయుధ బలగాల ప్రయత్నాలను దెబ్బ తీశాయి. మంబై అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుకారం ఉగ్రవాది కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నాడు. తుకారాం మరణించాడు. అతని ఉనికినే పూర్తిగా మర్చిపోయారు.

3. కొద్ది వారాల క్రితం మన నావికులను సోమాలి సముద్రపు దొంగల బారి నుంచి బయటపడ్డారు. పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీకి కృతజ్ఞతలు చెప్పాలి. తెర వెనక భారత ప్రభుత్వం ఇందుకు చర్యలు తీసుకుని ఉంటుంది. కానీ, పౌరులు గానీ నావికుల కుటుంబాలు గానీ భారత్ ఏం చేసిందనేది తెలుసుకోలేకపోయారు. సముద్రపు దొంగలు ఆ దశం పూర్తి స్థాయి నేవీకి చెందినవారు కూడా కాదు. సముద్రపు దొంగలనే ఎదుర్కోలేకపోతే, టెర్రరిస్టులను మనం ఏ విధంగా ఎదుర్కోగలం?

4. 2011 జులై 10వ తేదీన రెండు భారీ రైలు దాడులు భారత్‌ను తాకాయి. రైల్వే శాఖ సహాయ మంత్రి ముకుల్ రాయ్ సంఘటనా స్థలాన్ని సందర్శించడానికి నిరాకరించారు. ప్రధానిని వెళ్లనీయండని ఆయన బహిరంగంగా చెప్పారు. అస్సాం రైల్వే ప్రమాద సంఘటనా స్థలానికి తాను వెళ్లానని కొత్త రైల్వే మంత్రి దినేష్ త్రివేది చెప్పారు. తన బాస్ మమతా బెనర్జీ ఆదేశించడంతో తాను వెళ్లానని చెప్పారు. మన మంత్రివర్గంలో ఎవరైనా గౌరవిస్తారా, భయపడుతారా, అవును భయపడుతారు, ప్రధాన మంత్రి, సందేహం ఉందా?

ముంబై పేలుళ్లపై ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశాయి. ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మనలకు చెబుతున్నారు. వాస్తవం మనకు అర్థం కావాలి, అప్పుడే సమస్యను పరిష్కరించుకోగలం. ప్రపంచం కాదు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రపంచం పుష్పగుచ్ఛాలు పంపుతుంది.

భారతదేశం మూలం- ఆర్థిక పరిపుష్టికి కృషి చేయడమే. మనం వెనక్కి రాతియుగంలోకి వెళ్లడానికి సిద్ధంగా లేం. ప్రభుత్వం కాకపోయినా మనం ముందుకు సాగుతాం.

English summary
On July 13, 2011 SMSs started flooding on our mobiles about the unfortunate bomb blasts in 3 locations of Mumbai – Opera House, Dadar, Zaveri Market (famous for diamonds).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X