సెట్స్ పైకి మళ్ళీ పవన్ 'సత్యాగ్రహి'!!

Pawan Kalyan
పవన్ కళ్యాణ్ కలల ప్రాజెక్టు సత్యాగ్రహి. తను ఎంతో ఇష్టపడి ప్రారంభించినటువంటి ఈ చిత్రం త్వరలో మళ్ళీ పట్టాల ఎక్కనుందని సమాచారం.ఈ చిత్రాన్ని మెగా ప్రాజెక్టుగా చేయాలని పవన్ భావిస్తున్నారు.ఇందుకోసం ఆయన క్రియోటివ్ టీమ్ గత కొద్ది రోజులుగా కుస్తీ పడుతోంది.ఆయన ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ పవన్ కల్యాణ్ క్రియోటివ్ వర్క్స్ పై నిర్మించాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడు.అప్పట్లో ఈ చిత్రాన్ని బంగారం నిర్మించిన నిర్మాతలు చేత ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు.ఆ తర్వాత సీన్ లోకి సూర్య పేపర్ అధినేత నూకారపు సూర్య ప్రకాశరావు వచ్చారు.కానీ తర్వాత ఆ ప్రపోజల్ ఆగిపోయింది.అయితే పవన్ మాత్రం ఈ చిత్రం పై చాలా నమ్మకముంది.

అయితే ఈ చిత్రాన్ని తానే డైరక్ట్ చేయాలా లేక వేరేవారికి అప్పచెప్పాలనేదే ఇప్పుడు ఆయన్ని ఆలోచనలో పడేస్తున్న అంశం.ఆయన భార్య రేణు దేశాయ్ ని ఈ చిత్రానికి నిర్మాతగా పెట్టి అంతా తానే ముందుకు నడిపించాలనుకుంటున్నాడు.ప్రస్తుతం పవన్ తీన్ మార్ ప్రాజెక్టులోనూ,గబ్బర్ సింగ్ ప్రాజెక్టులోనూ బిజీగా ఉన్నారు.రెండూ హిందీ చిత్రాల రీమేక్ లు కావటంతో ఈ సారి తాను చేసేది రీమేక్ కాకూడదని,అందుకే సత్యాగ్రహిని భుజాన ఎత్తుకున్నాడని అంటున్నారు.

తన కిష్టమైన చేగువేరా సిద్ధాంతాలను బలపరచటం,కామన్ ఫ్రొటక్షన్ ఫోర్స్ కి సంభందించిన వివరాలను విశదీకరించి అదో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయని అంటున్నారు. అలాగే తన దర్శకత్వంలో రానున్న చిత్రం కావటం తో కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా వాస్తవికతకు పెద్ద పీట వేయనున్నాడని తెలుస్తోంది. పూర్తిగా పవన్ ఆలోచనలతో రూపొందే ఈ చిత్రం మరో జానిలా కాకుండా జల్సాలా విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+