హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజన: సీమాంధ్ర దేవుళ్లు శ్రీమంతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే అతి సంపన్నమైన దేవాలయాలు చాలా వరకు సీమాంధ్రలోకి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. ప్రసిద్ధమైన దేవతలు, దేవుళ్లు ఎక్కువగా సీమాంధ్రలోనే కొలువు తీరారు. భద్రాచాలం సీతారాముడు కూడా సీమాంధ్రలోనే చేరుతాడనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే తమ ఇష్టదేవాలను దర్శించుకోవడానికి తెలంగాణ భక్తులు రాష్ట్ర సరిహద్దులను దాటాల్సి ఉంటుంది.

ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక సీమాంధ్రలోని అతి సంపన్నమైన దేవాలయాలు గురించి, వాటికి ఆదాయం గురించి ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రపంచ ప్రసిద్ధమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సీమాంధ్రలోని తిరుపతిలో కొలువు తీరాడు. తిరుమలేశుడి ఆదాయమే గత ఆర్థిక సంవత్సరంలో 2,010 కోట్ల రూపాయలు ఉంది.

Temples

తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో కూడా తిరుమలేశుడికి ఈ ప్రాంతం నుంచి భక్తుల తాకిడి తగ్గలేదు. భక్తుల సంఖ్య తగ్గలేదు, ఆదాయం కూడా తగ్గలేదు. రాష్ట్రంలోని పది దేవాలయాలు యేటా పది కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాయి. సీమాంధ్రలో ఉన్న ఇతర ప్రసిద్ధ దేవాలయాలు - కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి (ఆదాయం దాదాపు రూ. 70 కోట్లు), విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం (ఆదాయం దాదాపు రూ.65 కోట్లు), చిత్తూరు జిల్లాలోని శ్రీకాహస్తీశ్వర స్వామి దేవస్థానం (ఆదాయం దాదాపు రూ. 40 కోట్లు), విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్,్మి నర్సింహస్వామి దేవస్థానం (ఆదాయం దాపు రూ. 35 కోట్లు).

ఇంకా, తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరంలో గల శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం (ఆదాయం దాదాపు రూ. 25 కోట్లు), చిత్తూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం (ఆదాయం దాదాపు రూ. 30 కోట్లు), చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం (ఆదాయం దాదాపు రూ. 27 కోట్లు).

అయితే, తెలంగాణలో నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం, కరీంనగర్ జిల్లాలోని వేములవాడు శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం వంటివి ఉన్నాయి.

English summary
With the state divided, its gods and goddesses, famous for their temples’ wealth, too will be on different sides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X