జిఎంఆర్ టు బండ్ల గణేష్: అందరి లెక్క తేల్చేస్తారా?

ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున పేరుకు పోయిన ద్రవ్యలోటు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వానికి రూ.లక్షల కోట్లు అవసరమైన నేపథ్యంలో లొసుగులు సరి చేయాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఐటి శాఖ జల్సారాయుళ్ల పైన, ఆదాయానికి మించి ఖర్చు చేసేవారి పైన, ఆదాయానికి తగ్గ పన్ను కట్టనివారి పైన కన్ను వేసింది. బ్యాంకుల్లో భారీ మొత్తం నగదు నిల్వ ఉండటం, రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడం, విరివిగా క్రెడిట్ కార్డులు వాడటం వంటివి చేసే వారిపై ఐటి శాఖ కన్నేసింది!
ఈ మేరకు మన రాష్ట్రంలోనే లక్షన్నర మందితో కూడిన ఓ జాబితాను ఐటి శాఖ అధికారులు సిద్ధం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఎవరిపై దృష్టి పెట్టాలనే అంశానికి సంబంధించి ఐటి శాఖ ఏడు ప్రమాణాలను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాలోని వ్యక్తులు లేదా సంస్థలు చేసే వ్యయానికి, చెల్లించే ఆదాయ పన్నుకు మధ్య పొంతన కుదరట్లేదు. దీంతో వీటి అసలు లెక్క ఏమిటో తేల్చేందుకు ఐటి అధికారులు సిద్ధమవుతున్నారట.
ఇందులో భాగంగా కొద్దిరోజుల క్రితం జిఎంఆర్, రాంకీలపై, ఇటీవలే సినీ నిర్మాత బండ్ల గణేష్ పైనా దాడులు చేసి తొలి దశలో రూ.కోటి ముందస్తు పన్ను కట్టించుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఇలా ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించని వారి వివరాలను ఐటి అధికారులు ఇప్పటికే సేకరించి పెట్టుకున్నారట. వీటి ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున అదనపు ఆదాయం పొందేందుకు వీలుగా ఐటి శాఖ కసరత్తు కూడా చేస్తోందట.
ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారట. అయితే, ఐటి శాఖ ప్రధాన లక్ష్యం దాడులు కాదనీ లెక్క ప్రకారం పన్ను చెల్లించని వారి నుంచి అదనపు ఆదాయం పొందడమేననీ తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో తాము తయారు చేసిన జాబితాలోని వారికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. అప్పటికీ పన్ను చెల్లించేందుకు ముందుకు రాకపోతే, అప్పుడు దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయట.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications