హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ లష్కర్ బోనాలు ఆదివారం అత్యంత ఘనంగా మొదలయ్యాయి. తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు.

సీఎం కేసీఆర్ దంపతులు ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టు చీర, సారెను సమర్పించారు. ఆలయ అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెల్లవారు జామునే అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు.

బోనాల్లో భాగంగా మహంకాళి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఓ అవివాహిత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది. ఈ సందర్భంగా పోతురాజుల వీరంగం, గావు కార్యక్రమాలు వేలాదిగా తరలివస్తున్న భక్తులను అలరించనున్నాయి.

అమ్మవారు పురవీధుల్లో ఏనుగు అంబారీపై ఊరేగనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి


తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్‌ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం 12గంటలకు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని పట్టు చీర, సారెను సమర్పించారు.

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

మహంకాళి ఆలయ అధికారులు, పూజారులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మహాకాళికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి


సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ సతీసమేతంగా తెల్లవారుజామున ఆలయానికి వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ సురిటి కృష్ణ, కార్యనిర్వహణాధికారి అశోక్‌కుమార్‌గౌడ్‌ ప్రత్యేక పూజలు చేశారు.

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి


బోనాలతో వచ్చిన మహిళలు వాటిని ఆ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికార అనధికార ప్రముఖులు పోటెత్తడంతో.. లష్కర్‌ సందడిగా మారింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

 వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి


మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. అంచనాలకు మించి తరలివచ్చిన భక్తుల రద్దీకి విఐపిలు కూడా తోడు కావడంతో అమ్మవారి దర్శనానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది.

 వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి


సీఎం వెంట దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎంపి కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, ఎమ్మెల్యే కొండా సురేఖ ఉన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, ఎం.వెంకయ్య నాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు.

 వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

వైభవంగా బోనాలు: నేడే రంగం, భవిష్యవాణి

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రెండు రాష్ట్రాలు స్నేహభావంతో మెలగాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. ఆయన వెంట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు ఉన్నారు.

English summary
Telagnana cheif minister K. Chandrasekar rao participates in Lashkar Bonalu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X