చెప్పలేని ఆనందం: 251మంది ఖైదీల రిలీజ్(పిక్చర్స్)
హైదరాబాద్: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో మంగళవారం నాడు వివిధ జైళ్ల నుంచి 251 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో 190 మంది జీవిత ఖైదీలున్నారు. వీరిని జనవరి 26న విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.
రాష్ట్రంలో వేర్వేరు జైళ్లలో ఉన్న వీరిలో మెజారీటీ ఖైదీలు మంగళవారమే విడుదలయ్యారు. కొన్నిచోట్ల జరిమానా చెల్లించలేక, దవాఖానల్లో చికిత్సపొందుతున్నవారు విడుదలకాలేదు. కాగా, విడుదలైన ఖైదీలు ఇక తమ కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా జీవిస్తామని చెప్పారు.
కాగా, ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చివరిసారిగా క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష అవకాశం జీవిత ఖైదీలకే లభించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తొలిసారిగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష అవకాశం కల్పించింది. జీవిత ఖైదీలతోపాటు ఇతర ఖైదీలకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 17న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అర్హుల జాబితా ప్రకటించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
జైళ్లశాఖ డీజీ వీకేసింగ్ అర్హుల జాబితాను ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం 251 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటిస్తూ జీవో 38 జారీచేసింది. మూడు కేటగిరీలుగా ప్రభుత్వం జాబితాను రూపొందించి, సత్ప్రవర్తన ఖైదీలను మంగళవారం విడుదల చేసింది.
251 మందిలో 190 మంది జీవిత ఖైదీలు, 61 మంది నాల్‌లైఫ్ శిక్ష అనుభవిస్తున్న వారున్నారు. జీవిత ఖైదీల్లోనూ రెండు కేటగిరీలున్నాయి. జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తూ, క్షమాభిక్షతో విడుదలైన 190 మందిలో 126 మంది పదేళ్ల శిక్ష, 64 మంది 14 ఏళ్ల శిక్ష అనుభవించినవారున్నారు.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో మంగళవారం నాడు వివిధ జైళ్ల నుంచి 251 మంది ఖైదీలు విడుదలయ్యారు.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
వీరిలో 190 మంది జీవిత ఖైదీలున్నారు. వీరిని జనవరి 26న విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
రాష్ట్రంలో వేర్వేరు జైళ్లలో ఉన్న వీరిలో మెజారీటీ ఖైదీలు మంగళవారమే విడుదలయ్యారు.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
కొన్నిచోట్ల జరిమానా చెల్లించలేక, దవాఖానల్లో చికిత్సపొందుతున్నవారు విడుదలకాలేదు.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చివరిసారిగా క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష అవకాశం జీవిత ఖైదీలకే లభించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తొలిసారిగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష అవకాశం కల్పించింది.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
జీవిత ఖైదీలతోపాటు ఇతర ఖైదీలకు అవకాశం కల్పించింది.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
ఫిబ్రవరి 17న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అర్హుల జాబితా ప్రకటించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
జైళ్లశాఖ డీజీ వీకేసింగ్ అర్హుల జాబితాను ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం 251 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటిస్తూ జీవో 38 జారీచేసింది.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
మూడు కేటగిరీలుగా ప్రభుత్వం జాబితాను రూపొందించి, సత్ప్రవర్తన ఖైదీలను మంగళవారం విడుదల చేసింది.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
251 మందిలో 190 మంది జీవిత ఖైదీలు, 61 మంది నాల్‌లైఫ్ శిక్ష అనుభవిస్తున్న వారున్నారు. జీవిత ఖైదీల్లోనూ రెండు కేటగిరీలున్నాయి.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తూ, క్షమాభిక్షతో విడుదలైన 190 మందిలో 126 మంది పదేళ్ల శిక్ష, 64 మంది 14 ఏళ్ల శిక్ష అనుభవించినవారున్నారు.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
చర్లపల్లి జైలులోని వ్యవసాయక్షేత్రంలో పనిచేస్తున్న 39 మంది ఖైదీలకు, జైలు శిక్ష అనుభవిస్తున్న 48 మంది, చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న తొమ్మిది మంది, సంగారెడ్డి జైలు నుంచి ఆరుగురు, మహబూబ్‌నగర్ జైలు నుంచి ఏడుగురు, నల్లగొండ జైలు నుంచి ఆరుగురు, హైదరాబాద్‌లోని మహిళాజైలు నుంచి 26 మంది మహిళాఖైదీలు, వరంగల్ కేంద్ర కారాగారం నుంచి 70 మంది, ఆదిలాబాద్ జైలు నుంచి ఎనిమిది మంది, నిజామాబాద్ నుంచి 17 మంది, కరీంనగర్ నుంచి ఏడుగురు, ఖమ్మం జైలు నుంచి ఎనిమిది మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది.

చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
వరంగల్‌లో క్షమాభిక్ష పొందిన 70 మందిలో 59 మంది మంగళవారం విడుదలవగా మిగతా 11 మందిలో నలుగురు జరిమానా కట్టలేక ఆగిపోయారు. ఒకరు అనారోగ్యంలో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఉన్నారు. ఒకరు ముందే విడుదలైపోగా, మిగతావారిపై వేరే కేసులు ఉండటంతో విడుదల సాధ్యంకాలేదు.

విడుదలైన అబ్దుల్ ఖదీర్
వీరిలో పాతబస్తీలో 1990లో ఏసీపీ సత్తయ్యను కాల్చి హతమార్చిన నేరంలో శిక్ష అనుభవిస్తున్న మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ కూడా ఉన్నారు.

విడుదలైన అబ్దుల్ ఖదీర్
సియాసత్ డైలీ కార్యాలయంలో అబ్దుల్ ఖదీర్‌తో సియాసత్ ఎడిటర్ జహీద్ అలీ ఖాన్.












Click it and Unblock the Notifications