నుమాయిష్: టీ వంటకాలకు గిరాకీ (పిక్చర్స్)

హైదరాబాద్: ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతి ఏటా నిర్వహిస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు ఈ సారి అంఛనాలకు మించి సందర్శకులొస్తున్నారు. 74వ ఈ పారిశ్రామిక ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటల నుంచి సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఎప్పటి మాధిరిగా సాయంత్రం వేళల్లో మాత్రమే కాకుండా మధ్యాహ్నం కాస్త ముందుగానే ప్రదర్శనను ప్రారంభించాలన్న డిమాండ్ విన్పిస్తోంది.

ప్రదర్శనలోని మొత్త 2600స్టాళ్లలో సుమారు 500 స్టాళ్లలో ఏర్పాటైన గృహోపకరణాలనే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అంతేగాక, పలు సంస్థలు నుమాయిష్ సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించడం కూడా కొనుగోళ్లు పెరిగేందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ప్రదర్శనల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భారీగా ఏర్పాటైన మెట్రోరైలు నమూనా భోగినీ తిలకించేందుకు ప్రతిరోజు వేలాది సంఖ్యలో సందర్శకులు తరలిస్తున్నారు.

దీంతో పాటు ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటైన తెలంగాణ స్టాల్‌లోని వంటకాలను రుచి చూసేందుకు భోజన ప్రియులు ముందుకొస్తున్నారు. దీంతో పాటు ప్రదర్శనలో మరో వంద స్టాళ్ల వరకు సౌత్, నార్త్ ఇండియాలకు చెందిన వంటకాల స్టాళ్లలో కూడా సందర్శకుల సంఖ్య అధికంగా కన్పిస్తోంది.

సాహసోపేత విన్యాసాలతో డేర్ డ్రైవర్స్ యువకులను ఆకట్టుకుంటున్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శన ఇప్పటికే 27రోజులు పూర్తి చేసుకోగా, ఈ నెలలో సెలవులు ఎక్కువగా రావటం వల్లే సందర్శకుల తాకిడి పెరిగిందని చెప్పవచ్చు. మున్ముందు ముగింపు రోజుల్లో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.

కిటకిటలాడుతున్న నుమాయిష్

కిటకిటలాడుతున్న నుమాయిష్

విద్యాసంస్థల నిర్వహణకు నిధులను సేకరించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ యేటా పారిశ్రామిక ప్రదర్ననను నిర్వహిస్తోంది. ఈసారి ఈ ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తుతున్నారు.

తెలంగాణ దుస్తులకు గిరాకీ

తెలంగాణ దుస్తులకు గిరాకీ

దేశ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న రాష్ట్ర విభజన ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తెలంగాణలోని సిరిసిల్ల, నారాయణపేట, అమరచింత, పోచంపల్లి, గద్వాల, కొత్తకోట చేనేత వస్త్రాలకు గిరాకీ పెరిగింది.

పిల్లల ముచ్చట..

పిల్లల ముచ్చట..

కూర్చున్న చోటే మొత్తం ప్రదర్శనలోని స్టాళ్లను సందర్శించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన చుక్ చుక్ రైలుతో చిన్నారులు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.

నిర్మల్ బొమ్మలపై ఆసక్తి

నిర్మల్ బొమ్మలపై ఆసక్తి

తెలంగాణ హస్తకళాఖండాలను తిలకించే వారి సంఖ్య పెరుగుతోంది. నిర్మల్ బొమ్మలు చిన్నారులను ఎంతో మక్కువతో కొనుగోలు చేస్తున్నారు.

అంతులేని ఆసక్తి, ఉత్సుకత

అంతులేని ఆసక్తి, ఉత్సుకత

ఏటా ప్రదర్శన జరిగిన 45 రోజుల్లో 20 నుంచి 222లక్షల మంది సందర్శకులొచ్చే వారని, ఈసారి ప్రదర్శన ప్రారంభించిన కేవలం 26 రోజులకే ఆ సంఖ్య దాటిపోయినట్లు అంఛనా.

ఆసారి రెట్టింపు..

ఆసారి రెట్టింపు..

గత సంవత్సరం కన్నా ఈ సారి ఆదరణ రెట్టింపు స్థాయిలో పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం కూడా ప్రదర్శితమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+