ఐటీ జీవులకు కలత నిద్రే?: నిర్మొహమాటంగా గెంటేస్తున్నారు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏళ్లుగా పనిచేసిన కంపెనీ ఉన్నపలంగా ఉద్యోగం ఊడబీకి రోడ్డు మీదకు నెట్టేస్తోంది.ఏళ్ల పాటు సంస్థ కోసం ఎంత నిబద్దతగా పనిచేసినా.. ఉద్యోగ తొలగింపుకు అవేవి వారికి అడ్డు రావడం లేదు. కనీసం కారణమేంటనేది కూడా చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా సంస్థ నుంచి గెంటేస్తున్నారు.

రోడ్డున పడ్డ 250మంది టెక్కీలు: బోర్డు తిప్పేసిన 4కంపెనీలు, దిక్కులేని స్థితిలో!..

యథేచ్చగా చట్టాలను ఉల్లంఘిస్తూ.. కనీసం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఇవ్వకుండా కంపెనీలు ఉద్యోగులకు నరకం చూపిస్తున్నాయి. పంపించేయాలని ఫిక్స్ అవడమే ఆలస్యం.. కారణాలు చూపించాల్సిన అవసరాన్ని కూడా వారు పట్టించుకోవడం లేదు. ఒక్క ఫోన్ కాల్ తో మీరు ఇక కంపెనీకి రావాల్సిన అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాయి.

ఐటీ ఉద్యోగులకు కష్టకాలం: డిమాండ్ కొత్త టెక్నాలజీకే.. నేర్చుకోవాలంటే లక్షల్లో ఫీజులు

వెళ్లకపోతే.. సాగనంపుతాం:

వెళ్లకపోతే.. సాగనంపుతాం:

ఐటీ కంపెనీల్లో ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. ఎంత బాగా పెర్ఫామ్ చేసినా సరే ఏదొక రోజు కంపెనీ నుంచి అవుట్ కాక తప్పని పరిస్థితి. సంస్థాగతంగా తమవైపు నుంచి ఎలాంటి తప్పులు లేవనే కంపెనీలు చెబుతాయి. కారణం చూపించాలి కాబట్టి.. పనితీరు బాగాలేదనో.. మరొకటో చెప్పి సాగనంపుతున్నాయి.

గత 15ఏళ్లుగా ఐటీ కంపెనీలో సేవలు అందిస్తున్న ఓ ఉద్యోగికి ఇటీవల రాత్రి సమయంలో ఒక మెసేజ్ వచ్చింది. 'మీరెలాగు వెళ్లేలా లేరు కాబట్టి.. మిమ్మల్ని సాగనంపడం మాకు తప్పేలా లేదు, ఇక వెళ్లడానికి సిద్దంగా ఉండండి' అంటూ చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా అతని మైండ్ బ్లాంక్ అయింది. నెక్స్ట్ ఏంటి? అని ఆలోచించుకునేంత సమయం కూడా ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తీసేయడం తీవ్రంగా బాధపెట్టింది.

ఆరోగ్య సమస్యలున్నా:

ఆరోగ్య సమస్యలున్నా:

ఉద్యోగ భద్రతా లేకపోవడానికి తోడు.. పని ఒత్తిడి కూడా ఐటీ కంపెనీల్లో విపరీతంగా ఉంటోంది. పనివేళల కన్నా ఎక్కువ సమయం ఆఫీసులోనే కూర్చొబెట్టడం.. ఒత్తిడి చేసి మరీ ప్రాజెక్టులు పూర్తి చేయించుకోవడం సర్వసాధారణమైపోయింది.

నగరంలోని ఓ కంపెనీకి చెందిన వ్యక్తి.. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న సరే కంపెనీ కోసం నిబద్దతగా పనిచేశాడు. నిజానికి ఆయన సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కానీ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచనతో.. సర్జరీని వాయిదా వేసుకుని మరీ కంపెనీకి ఇన్ టైమ్ కన్నా ముందే ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చాడు.

ఇంతా చేస్తే.. అతనికి దక్కిన ప్రతిఫలం ఉద్యోగం పోగొట్టుకోవమే. ఏమాత్రం కనికరం లేకుండా సదరు యాజమాన్యం ఆయన్ను విధుల నుంచి తప్పించింది.

అదొక సాకు మాత్రమేనా?:

అదొక సాకు మాత్రమేనా?:

ఆటోమేషన్ ప్రభావానికి తోడు కొత్త టెక్నాలజీ రాకతో అప్ డేట్ కావాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కొత్త టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీలు ఉద్యోగులకు ట్రెయినింగ్ ఇవ్వడం లేదు. ఏళ్ల నుంచి పనిచేస్తున్నవారిని సైతం నిర్మొహమాటంగా సాగనంపుతున్నాయి.

వారి స్థానంలో కొత్త టెక్నాలజీ నైపుణ్యాలు కలిగినవారిని తీసుకుంటున్నాయి. ఏళ్లుగా సంస్థ లాభాల కోసం పనిచేసిన ఉద్యోగులకు కనీసం నైపుణ్యాలు మెరుగుపరుచుకునే శిక్షణ ఇవ్వడానికి కూడా కంపెనీలు మొగ్గుచూపడం లేదు. అదేమంటే.. అంత సమయం తాము వృథా చేసుకోదలుచుకోలేదనేది సమాధానం.

చట్టాలు పట్టవా?:

చట్టాలు పట్టవా?:


ఐటీ కంపెనీల్లో చాలామట్టుకు షాప్స్&డెవలప్ మెంట్స్ చట్టం కిందనే ఎక్కువగా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ చట్టం పరిధిలోని ఆర్టికల్‌ 47(1), (2) ప్రకారం కంపెనీలోని ఏ ఉద్యోగినైనా తొలగించాలనుకుంటే సహేతుకమైన కారణాన్ని చూపించాల్సిందే. కానీ కంపెనీలకు ఇవేవి పట్టడం లేదు. జస్ట్ పెర్ఫామెన్స్ బాగా లేదన్న కారణం చెప్పి వారిని ఉద్యోగాల నుంచి తప్పించేస్తున్నాయి.

ఒకవేళ ఉద్యోగిని తొలగించాల్సి వస్తే ఆ విషయాన్ని సదరు సంస్ధ రాతపూర్వకంగా ఉద్యోగికి తెలియజేయడంతో పాటుగా దానికి సంబంధించిన జిరాక్స్ కాపీని లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌కు అందించాలి.

ఒకవేళ ఉద్యోగి ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే విచారణ పూర్తయ్యేంతవరకూ ఆ ఉద్యోగిని విధుల్లోంచి తొలగించడానికి వీల్లేదు. కానీ అక్కడ జరుగుతున్నదంతా ఇందుకు పూర్తి భిన్నం. ఆఖరికి తమ సమస్యలను లేబర్‌ కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని ఐటీ జీవులు వాపోతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
These situations can be difficult for employers on a number of fronts – seeing your valued employee go through a rough time is bad enough

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X