అడ్రస్ పంపితే చాలు..: కొత్త జంటలకు పోస్టులోనే శ్రీవారి ఆశీస్సులు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వివాహం కాగానే కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడాన్ని మరింత సులభ సాధ్యం చేస్తోంది. అంతేకగా, భక్తులు పూర్తి చిరునామాతో శుభలేఖ పంపితే చాలు.. శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని పోస్టులో పంపనుంది.

వధూవరులు కల్యాణంలో తొలి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుంచి రక్షాబంధనంగా భావిస్తూ వీటిని ధరింపజేస్తారు. ఇందుకు ప్రతీకగా.. శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమను, కంకణాన్ని పంపుతారు.
నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపడం జరుగుతుంది. వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలిపేందుకు టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మణయ్య రచించిన 'కల్యాణ సంస్కృతి' పేరిట ఓ పుస్తకాన్ని, టీటీడీ ఈవో పేరిట వేద ఆశీర్వచనం పత్రికను కొత్త జంటలకు పంపుతారు.

ఇందుకోసం నూతన వధూవరులు 'కార్యనిర్వహణాధికారి, టీటీడీ పరిపాలన భవనం, కెటి రోడ్డు, తిరుపతి- 517501' పేరిట వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్ సెంటరును 0877- 2233333, 2277777 ఫోన్లలో సంప్రదించాలని టీటీడీ సూచించింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications