నింగి-నేల మధ్యలో పెళ్లి: గాల్లో వేలాడుతూ ఒక్కటైన జంట!
కొల్హాపూర్: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. కానీ, వివాహ వేడుకలు మాత్రం మన ఇష్టప్రకారమే జరుగుతాయి. సంపన్నులు అంగరంగా వైభవంగా చేస్తే.. సామాన్యులు ఉన్నంతలో ఘనంగా చేసుకుంటారు. కానీ, కొందరు మాత్రం అందరికీ భిన్నంగా చేయాలనుకుంటారు. సాహసం అంటే ఇష్టపడే ఓ జంట కూడా మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో వినూత్న రీతిలో పెళ్లి చేసుకున్నారు.

కొల్హాపూర్‌కు చెందిన పర్వతారోహకుడు జైదీప్ గునాజీరావ్ జాదవ్(30), రేష్మలు కూడా తమ వివాహాన్ని భూమి, ఆకాశానికి మధ్య జరుపుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. షాహువాడి తహసీల్‌కు చెందిన జైదీప్ జాదవ్‌కు అదే ప్రాంతానికి చెందిన రేష్మ పాటిల్‌తో వివాహం నిశ్చయమైంది.
అయితే పర్వతారోహణ ఔత్సాహికులైన వీరు తమ వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే కొల్హాపూర్‌లోని పర్వత ప్రాంతాల్లో వేడుక ఏర్పాటుచేశారు. భూమికి వేయి అడుగుల పైన పర్వతాల మధ్య ఉన్న రోప్‌వేపై పెళ్లి చేసుకున్నారు.

వధూవరులిద్దరూ తాళ్లతో వేలాడుతూ ఉండగా.. పూజారి తాడుపై నిలబడి వివాహతంతు ముగించాడు. ఇక ఇరువురి కుటుంబాలు, బంధువులు సమీపంలోని పర్వత అంచుపై నిలుచుని వధూవరులను ఆశీర్వదించారు. తాము అనుకున్నట్లు వివాహం కావడంతో ఈ నవ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications