మాల్‌లో మహేష్ భార్య నమ్రత సందడి(ఫోటోలు)
హైదరాబాద్: ఆర్ట్‌ని తానిష్టపడతానని, మంచి ఆర్ట్ వర్క్స్‌ని కలెక్ట్ చేస్తుంటానని నటి, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ఏర్పాటు చేసిన అద్భుతమైన కళాప్రదర్శన 'అట్రియం గ్యాలెరియా' ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు.
ఆస్టేలియన్ ఫోటోగ్రాఫర్, ఆర్టిస్ట్ లోనా లోగాన్‌తో పాటు రంగోలీ గార్గ్, అనురాధా ఠాకూర్, సతీష్ కన్నా, విజిత్ పిళ్లై సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభించిన అనంతరం నమ్రత మాట్లాడుతూ ఇనార్భిట్ మాల్ ప్రారంభించిన అద్బుతమైన కార్యక్రమం ఇదన్నారు.

మహేష్ భార్య నమ్రత చేతుల మీదగా ఆర్ట్ వర్క్స్ ప్రారంభం
ఆర్ట్‌ని ప్రజలకి మరింత చేరువచేయడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. అదే సమయంలో ఆర్టిస్ట్‌లను కూడా ప్రజలకు మరింత దగ్గర చేస్తుందన్నారు.

మహేష్ భార్య నమ్రత చేతుల మీదగా ఆర్ట్ వర్క్స్ ప్రారంభం
వ్యక్తిగతంగా తాను ఆర్ట్ లవర్‌నని చెబుతూ ఎంఎఫ్ హుస్సేన్, లక్ష్మాగౌడ్ వంటి వారి చిత్రాలు తన దగ్గర ఉన్నాయన్నారు. ఈ కళాప్రదర్శన ప్రారంభోత్సవంలో నేను ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

మహేష్ భార్య నమ్రత చేతుల మీదగా ఆర్ట్ వర్క్స్ ప్రారంభం
ఇనార్భిట్ మాల్ సెంటర్ హెడ్ విజయ్ భాటియా మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో ఆరుగురు సుప్రసిద్ధ ఆర్టిస్ట్‌ల చిత్రాలని ప్రదర్శిస్తున్నామన్నారు.

మహేష్ భార్య నమ్రత చేతుల మీదగా ఆర్ట్ వర్క్స్ ప్రారంభం
ఆస్టేలియన్ ఫోటోగ్రాఫర్, చిత్రకారిణి లోనా లోగాన్ ఇండియా జక్ట్సాపోజ్ అంటూ భారతీయ వింటేజ్ చిత్రాలని ప్రదర్శిస్తున్నారు.

మహేష్ భార్య నమ్రత చేతుల మీదగా ఆర్ట్ వర్క్స్ ప్రారంభం
దాదాపు 14 ఏళ్లుగా భారతదేశంలో తాను చూసిన, తీసిన ఫోటోలతో తాను చేస్తోన్న ప్రదర్శనని లైఫ్ ఫీల్డ్ ట్రిప్‌గా అభివర్ణిస్తున్నారు లోనా.

మహేష్ భార్య నమ్రత చేతుల మీదగా ఆర్ట్ వర్క్స్ ప్రారంభం
ఈ ప్రదర్శన సెప్టెంబర్ 13 వరకూ నిర్వహించనున్నారు. వీటితో పాటు చిన్నారుల కోసం హాస్యభరిత కార్యక్రమాలను, చిన్నారులు తల్లిదండ్రుల కోసం చిత్రలేఖనం, మట్టి మోడలింగ్, ప్రత్యక్ష చిత్రలేఖనం మొదలైన్ పోటీలను ఇనార్బిట్ మాల్‌లో నిర్వహిస్తున్నారు.
మహేష్ భార్య నమ్రత చేతుల మీదగా ఆర్ట్ వర్క్స్ ప్రారంభం
అద్భుతమైన కళాఖండాలతో సెల్ఫీ తీసుకొని మరుపురాని అనుభూతులు పొందే అవకాశాన్ని, ఆశ్చర్యకరమైన బహుమతులను పొందే అవకాశాన్ని కూడా ఇనార్బిట్ మాల్ అందిస్తుంది.

Click it and Unblock the Notifications