తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గత మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరు కనబర్చిన తెలుగు టైటాన్స్ మరోసారి నిరాశపర్చింది. హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత ఘన విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగు టైటాన్స్ మరోసారి ఓటిమిపాలైంది. మంగళవారం గచ్చిబౌలిలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 28-30తో బెంగళూరు బుల్స్‌ చేతిలో ఓటమి పాలైంది.

చివర్లో తెలుగు టైటాన్స్ టైటాన్స్‌ కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి, మరో రైడర్‌ నీలేశ్‌ సాలుంకే అద్భుతంగా పోరాడినా విజయానికి ఆ జట్టు మూడు పాయింట్ల దూరంలో ఆగిపోయింది. టైటాన్స్ తరఫున రాహుల్ 9, నీలేశ్ 7 పాయింట్లు, బుల్స్ ఆటగాడు రోహిత్ కుమార్ 11 రైడింగ్ పాయింట్లు స్కోర్ చేశారు.

 తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

బెంగళూరు జట్టులో స్టార్‌ ఆటగాడు రోహిత్‌కుమార్‌ కెప్టెన్ సురేందర్, ఆశిష్‌లు రాణించారు. రోహిత్‌కుమార్‌ ఏకంగా 11 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

 తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు సీజన్‌లో ఇది నాలుగో ఓటమి. ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో 14 నిమిషాలకు టైటాన్స్, బుల్స్ 7-7తో సమంగా నిలిచాయి.

 తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

ఈ సమయంలో ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు బుల్స్ ఆటగాడు వినోద్‌ కుమార్‌ డబుల్‌రైడ్‌ సాధించి.. టైటాన్స్‌ బృందంలో ముగ్గుర్నే మిగిల్చాడు. వెంటనే వాళ్లూ ఔటవడంతో తెలుగు జట్టు 8-14తో వెనుకంజ వేసింది. ఆ తర్వాత మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఆధిక్యాన్ని ప్రదర్శించలేక పోయింది.

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

టైటాన్స్ స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి తొలి అర్ధ భాగంలో 12 సార్లు రైడింగ్‌కు వెళ్లి 2 సార్లు మాత్రమే పాయింట్లతో తిరిగొచ్చాడు. అర్ధసమయం ముగిసే సరికి టైటాన్స్ 11-16తో వెనుకబడింది. రెండో అర్ధ భాగంలో జోరు తగ్గకుండా చూసుకున్న బెంగళూరు.. ఓ దశలో 29-20తో ఆధిక్యం సంపాదించింది.

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

అయితే తెలుగు టైటాన్స్ రైడర్లు రాహుల్‌, నీలేశ్‌, సందీప్‌ వరుసగా పాయింట్లు తీసుకొస్తూ బెంగుళూరు బుల్స్‌ను ఆలౌట్ చేసింది. టైటాన్స్‌ 26-30కి చేరుకుంది.

 తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

నీలేశ్‌ మరో రైడ్‌ పాయింటు తేవడం.. ఇటు బెంగళూరు రైడర్‌ వినోద్‌ను డిఫెండర్లు పట్టేయడంతో టైటాన్స్‌లో గెలుపు ఆశలు చిగురించాయి.

 తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

స్కోరు సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా బెంగళూరు జాగ్రత్తగా ఆడి గెలిచింది.

 తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

ఆఖరి నిమిషంలో మరో రైడ్‌కు అవకాశం ఉన్నా అంపైర్లు సమయం ముగిసిందని ప్రకటించడంపై కెప్టెన్ రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ దామోదర్ టైటాన్స్ పట్ల ఎప్పడూ ఇలాగే వ్యవహరిస్తున్నాడని కెప్టెన్ రాహుల్ చౌదరి ఆరోపించాడు.

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

ఈ మ్యాచ్‌కి తెలుగు హీరో దగ్గుబాటి రానాతో పాటు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజక్ కుమార్‌లు హాజరయ్యారు.

 తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

తెలుగు టైటాన్స్ మ్యాచ్‌లో రానా, రకుల్ సందడి

మ్యాచ్ ప్రారంభానికి ముందు టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జాతీయ గీతాన్ని ఆలపించి అభిమానులను అలరించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ఓటమి పాలవడం అభిమానుల్ని నిరాశకు గురి చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengaluru Bulls came up with an inspiring performance led by Rohit Kumar to beat Telugu Titans 30-28 in the Pro Kabaddi League.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి