‘సదర్’ జోష్: దున్నపోతుల విన్యాసాలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలతోపాటు పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. భారీ దున్నపోతులతో యాదవ కులస్థులు చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. నరకాసుర్ని యాదవ కులానికి చెందిన సత్యభామ వధించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని యాదవ కులస్థులు ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలను ఈయేడు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ఎల్లరెడ్డిగూడలో మల్లేష్‌యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మహేష్‌యాదవ్ ఆధ్వర్యంలో రూ. 7కోట్ల దున్నపోతు(యువరాజు)తో విన్యాసాలు చేసి ఆడిపాడారు. ఈ ఉత్సవాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
ఖైరతాబాద్‌లో సత్తయ్య యాదవ్, మహేష్‌యాదవ్‌ల ఆద్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లిలో గురువారం సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యాదవుల సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా దీపావళి మరుసటి రోజు పోటాపోటీగా దున్నపోతులను అలంకరించి ప్రధాన వీధుల గుండా ఊరేగించడం అనవాయితీ. ఈ సందర్భంగా నిర్వహించే పోటీల్లో యాదవులు దున్నపోతులతో నిర్వహించిన విన్యాసాలు చూపరుల వళ్లు గగుర్పొడిచే విధంగా కట్టిపడేశాయి.
ఉత్తమంగా ఎంపికైన దున్నపోతుకు బహుమతి కూడా అందజేశారు. మేడ్చల్ పట్టణంలోని రాత్రిపది గంటల ప్రాంతంలో సదర్ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో పలువురు యాదవులు, తదితరులు పాల్గొన్నారు.

సదరోత్సాహం
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలతోపాటు పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.

సదరోత్సాహం
భారీ దున్నపోతులతో యాదవ కులస్థులు చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

సదరోత్సాహం
నరకాసుర్ని యాదవ కులానికి చెందిన సత్యభామ వధించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని యాదవ కులస్థులు ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలను ఈయేడు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

సదరోత్సాహం
ఎల్లరెడ్డిగూడలో మల్లేష్‌యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మహేష్‌యాదవ్ ఆధ్వర్యంలో రూ. 7కోట్ల దున్నపోతు(యువరాజు)తో విన్యాసాలు చేసి ఆడిపాడారు.

సదరోత్సాహం
ఈ ఉత్సవాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ హాజరయ్యారు.

సదరోత్సాహం
ఖైరతాబాద్‌లో సత్తయ్య యాదవ్, మహేష్‌యాదవ్‌ల ఆద్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌లు హాజరయ్యారు.

సదరోత్సాహం
ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సదరోత్సాహం
మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లిలో గురువారం సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.












Click it and Unblock the Notifications