చౌక బేరం: విక్రయానికి విజయవాడ.. చారిత్రక స్థలాల బదలాయింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న విజయవాడ నగరంలోని ప్రభుత్వ ఆస్తులు అంగట్లో సరుకుగా మారాయి.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న విజయవాడ నగరంలోని ప్రభుత్వ ఆస్తులు అంగట్లో సరుకుగా మారాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం రూపొందించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇందుకోసం నగరాభివృద్ధి, పర్యాటక రంగాన్ని అభివ్రుద్ధి చేస్తామని చెబుతోంది. తద్వారా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా విదేశీ, కార్పొరేట్ కంపెనీల పరం అవుతున్నాయి.విజయవాడలోని చారిత్రక కట్టడాలు, స్థలాలు త్వరలో కనుమరుగు కానున్నాయి. రూ.3500 కోట్ల విలువైన స్థలాలు, కట్టడాలు పరాధీనం కాబోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్లస్ దాని గెస్ట్ హౌస్‌తోపాటు బెజవాడకే తలమానికంగా భావించే స్వరాజ్ మైదానం సిటీ స్క్వేర్ గా రూపాంతరం చెందబోతున్నది.
చారిత్రక, వారసత్వ సంపదగా వెలుగొందుతున్న స్వరాజ్యమైదానాన్ని చైనా కంపెనీకి కట్టబెడుతున్న పాలకులు.. తాజాగా రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ముసుగులో కార్పొరేషన్ కార్యాలయంతోపాటు పరిసరప్రాంతాలను కాజేసేందుకు కుట్ర పన్నారు. సర్కార్ ఏకపక్ష నిర్ణయాలను విజయవాడ నగరవాసులు నిరసిస్తుండగా, ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి.

ఆ భూమి విలువ రూ.3,500 కోట్లు ఉంటుందని అంచనా
స్వరాజ్య మైదానంతోపాటు స్టేట్ గెస్ట్‌హౌస్, డీజీపీ క్యాంప్ కార్యాలయం, ట్రాన్స్‌కో కార్యాలయం, మునిసిపల్ కార్యాలయం, కౌన్సిల్ హాల్, రాజీవ్‌గాంధీ పార్కు, పూల, కూరగాయల మార్కెట్, విద్యుత్ సబ్‌స్టేషన్, పాతపోలీస్ క్వార్టర్స్, సీతమ్మవారి పాదాల స్థలం వెరసి 48.33 ఎకరాల భూమిని లీజు ముసుగులో తెగనమ్మేందుకు పాలకులు సిద్ధమయ్యారు. ఏలిన వారి ఆదేశాలు జారీ అయిన తర్వాత ఇందుకు తీసుకోవాల్సిన చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. భూ వినియోగమార్పిడి కోసం గత నెల 15వ తేదీన విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీయే)కి పంపింది. వివిధ సంస్థలకు ఏపీ సర్కార్ అప్పగిస్తున్న స్థలాల మార్కెట్ విలువ సుమారు రూ.3,500 కోట్లు ఉంటుందని అంచనా.

గెస్ట్‌హౌస్‌లోకి విజయవాడ నగర పాలక సంస్థ బదిలీ
కార్పొరేషన్ కార్యాలయం, విద్యుత్ సబ్‌స్టేషన్, రాజీవ్‌గాంధీ పార్కు, హోల్‌సేల్ ఫ్లవర్, కూరగాయల మార్కెట్ స్థలం కలిపి 20.04 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో ప్రస్తుత కౌన్సిల్ హాల్, నిర్మాణంలో ఉన్న కొత్త భవనం 82 సెంట్ల స్థలంలో ఉంటాయి. ఈ 82 సెంట్లు మినహా మిగతా స్థలాన్ని రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా భూవినియోగ మార్పిడి చేయాలని కోరుతూ కౌన్సిల్‌లో తీర్మానం చేసి సీఆర్‌డీఏకు పంపారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని కొత్త భవనంలోకి మార్చి పరిపాలన సాగిస్తామని, తరలింపు ఉండబోదని తీర్మానం సందర్భంగా పాలకులు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) సమావేశంలో కౌన్సిల్ మినహాయించిన 82 సెంట్ల స్థలాన్ని కూడా సేకరించాలని నిర్ణయించారు. ఈ విషయమై మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించి చెప్పినట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు భోగట్టా. బందరురోడ్డులోని మునిసిపల్ గెస్ట్‌హౌస్ స్థలంలో నగరపాలక సంస్థ కార్యాలయం నిర్మించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

భవన నిర్మాణం పూర్తయ్యే వరకు కార్యకలాపాలపై సందేహాలు
130 ఏళ్ల చరిత్ర గల మునిసిపల్ కార్యాలయం.. 1981లో నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. మొత్తం 16 సెక్షన్లలో 400 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. రోజూ 1,500 నుంచి 2 వేల మంది ప్రజలు వివిధ పనులపై కార్యాలయానికి వచ్చి వెళతారు. ఈ క్రమంలో హఠాత్‌గా కార్యాలయ మార్పిడి అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. నగర పాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లన్నీ లీజుల్లోనే కొనసాగుతున్నాయి. వాటిలోకి తాత్కాలికంగా కార్యాలయాన్ని మార్చే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం సూచించిన విధంగా గెస్ట్‌హౌస్ స్థలంలో కార్యాలయ నిర్మాణం చేపట్టినా అది పూర్తయ్యే వరకు ఎక్కడ నుంచి విజయవాడ నగర పాలక సంస్థ కార్యకలాపాలు నిర్వహించాలన్న సందేహాలు తలెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

రిక్రియేషన్ జోన్ నుంచి ఇలా ప్లేస్ మార్పు
ఇక సిటీస్క్వేర్ పేరుతో స్వరాజ్య మైదానం స్థలం 26 ఎకరాలను చైనా కంపెనీకి కట్టబెట్టేందుకు డీటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)ను సిద్ధం చేసిన ఏపీ సర్కార్.. విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్‌తో ఆమోదముద్ర వేయించింది. రిక్రియేషన్ జోన్‌లో ఉన్న గ్రౌండ్‌ను వాణిజ్య ప్రయోజనాలకు అనువుగా మార్చే అవకాశం లేదు. కానీ నిబంధలకు తూట్లు పొడిచి మిక్స్‌డ్ జోన్‌లోకి మారుస్తూ తీర్మానం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications