మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుగ్రామం: బ్రాహ్మణి, లోకేష్, భువనేశ్వరి ఇలా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో కలిసి మెదక్ జిల్లా ములుగు మండలం అడవిమసీద్ గ్రామంలో జరిగిన పాడి రైతుల సమావేశంలో సందడి చేశారు. రాష్ట్రంలో తమ సంస్థకు పాలు సరఫరా చేసే పాడిరైతులకు ప్రమాద బీమా అందించాలని నిర్ణయించినట్టు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ నారా లోకేష్ తెలిపారు.

శుక్రవారం ఆయన మెదక్ జిల్లా ములుగు మండలం అడవిమసీద్ గ్రామంలోని హెరిటేజ్ ఆవరణలో నిర్వహించిన పాడిరైతుల సమావేశంలో మాట్లాడారు. బీమా సౌకర్యాన్ని జనవరి 1 నుంచి అమలు చేస్తామని, ఇందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. పాడిరైతులు తమ సంస్థకు సరఫరా చేసే ప్రతి లీటర్ పాలకు చెల్లించే సొమ్ము నుంచి 10 పైసలను మినహాయించి, దానికి తమ సంస్థ నుంచి మరో 10 పైసలు కలిపి హెరిటేజ్ రైతు సంక్షేమ నిధిలో జమచేస్తామన్నారు.

హెరిటేజ్ సభ్యులు చనిపోతే రూ. లక్ష, ప్రమాదానికి గురైతే చికిత్స నిమిత్తం 50వేల రూపాయలు బీమా ఈ నిధి నుంచి చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం తమ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 8 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నందున ఏడాదికి దాదాపుగా రెండుకోట్ల రూపాయలు ఈ నిధిలో జమ అవుతాయన్నారు.

ఈ సమావేశంలో హెరిటేజ్ సంస్థ చైర్మన్ సాంబశివరావు, ఎండీ నారా భువనేశ్వరి, డైరెక్టర్ నారా బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉచిత ఆరోగ్య, పశువైద్య శిబిరాలు నిర్వహించారు.

నారా లోకేష్ తల్లి, భార్యలతో..

నారా లోకేష్ తల్లి, భార్యలతో..

నారా లోకేష్ అడవి మసీదు గ్రామంలో తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో కలిసి ఇలా కనిపించారు. వారు గ్రామంలోని పాడి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.

తల్లితో నారా లోకేష్ ముచ్చట

తల్లితో నారా లోకేష్ ముచ్చట

పాడి రైతులకు బీమా సౌకర్యం కల్పించాడనికి సిద్ధపడిన హెరిటేజ్ తరఫున సమావేశం ఏర్పాటు చేసిన నారా లోకేష్, భువనేశ్వరి ఇలా మాట్లాడుకుంటూ కనిపించారు.

నారా లోకేష్ సీరియస్‌గా..

నారా లోకేష్ సీరియస్‌గా..

నారా లోకేష్ ఇలా సీరియస్‌గా తన ప్రణాళికను చదువుతున్నట్లున్నారు. పాడి రైతులకు తాము బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇలా వివరిస్తూ భువనేశ్వరి..

ఇలా వివరిస్తూ భువనేశ్వరి..

రైతులకు వివరాలను అందిస్తూ నారా భువనేశ్వరి ఇలా కనిపిస్తే, కోడలు నారా బ్రాహ్మణి, నారా లోకేష్ చూస్తూ కనిపించారు.

రైతులతో కలిసిపోయి నారా లోకేష్..

రైతులతో కలిసిపోయి నారా లోకేష్..

రాజకీయ నాయకుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా నారా లోకేష్ యువకులకు చేరువ కావాలని అనుకుంటున్నట్లున్నారు.

మారుమూల గ్రామంలో ఇలా..

మారుమూల గ్రామంలో ఇలా..

మెదక్ జిల్లాలోని అడవిమసీదు గ్రామ ప్రజలు నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరిలను చూసి ఆశ్చర్యపోయి ఉంటారు.

రైతుల మధ్యకు ఇలా..

రైతుల మధ్యకు ఇలా..

నారా లోకేష్ మెదక్ జిల్లాలోని అడవిమసీదు గ్రామ రైతులకు తమ ప్రణాళికల గురించి వివరించారు. తాము కల్పించే బీమా గురించి చెప్పారు.

స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ ఇలా..

స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ ఇలా..

స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్, బాలకృష్ణ కూతురు అయిన బ్రాహ్మణి చిలుక ఆకుపచ్చ రంగు షాల్వార్ కమీజులో దుమ్ము దూళిలోకి అడుగు పెట్టి ఇలా కనిపించారు.

రైతు సంక్షేమం కోసం..

రైతు సంక్షేమం కోసం..

హెరిటేజ్ తరఫున రైతుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ముగ్గురు ఇలా కనిపించారు. అలసట కనిపించకుండా వారు రైతులతో కలిసిపోయారు.

సమావేశంలో ఇలా..

సమావేశంలో ఇలా..

రైతుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రాహ్మణి, భువనేశ్వరి, నారా లోకేష్ ఇలా కనిపించారు.

రైతు సమావేశంలో ఇలా

రైతు సమావేశంలో ఇలా

రైతుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రాహ్మణి, భువనేశ్వరి, నారా లోకేష్ ఇలా కనిపించారు. పాడి రైతుల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu's son Nara Lokesh, wife Bhuvaneswari and daughter - in - law Brahmani met Adavi Msjid villagers in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X