మళ్లీ కుండపోత, అప్పటి దాకా వర్షాలే - తాజా హెచ్చరిక...!!
మరోసారి కుండపోత తప్పేలా లేదు. హైదరాబాద్ తో పాటుగా పొరుగు జిల్లాల్లో వర్షం మొదలైంది. భారీగా ఈదురు గాలులతో వర్షం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. ఇప్పుడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. కొండాపూర్ లో గంటన్నార సమయంలో 8.1 సెం.మీ వర్షపాతం నమొదైంది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని అలర్ట్ జారీ చేసారు.
హైదరాబాద్ తో పాటుగా శివారు ప్రాంతాలు.. వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వాన కురుస్తోంది. శుక్రవారం రాత్రి కురిసిన వానతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. హైదరాబాద్‌లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రానున్న మరికొన్ని గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షం సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భాగ్యనగరంలో భారీ వర్షం
అయితే, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగుళూరుకు దారి మళ్లించారు. సీఎం ఢిల్లీ నుంచి 6ఈ717 ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ విమానం శుక్రవారం రాత్రి 9.20 గంటలకు శంషాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ సమయానికి విమానాశ్రయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విమానం ల్యాండ్ చేసే అవకాశం లేకపోవడంతో ఏటీసీ సూచనల మేరకు పైలట్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఆ విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. దేశంలో రుతుపవనాలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే నైరుతి రుతుపవనాల్లో వర్షపాతం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో 'సూపర్ ఎల్‌నినో' ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.













Click it and Unblock the Notifications