కేరళలో అల్లు అర్జున్ సునానీ.. 20 ఏళ్ల పాత సినిమాకు థియేటర్లలో జాతర..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఐపోయారు. పుష్ప సిరీస్ తో ఆయన దేశవ్యాప్తంగా భారీగా క్రేజ్ సాధించారు. అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే.. అయితే సాధారణంగా అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా రీ రిలీజ్ అవుతుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఓ పండగ వాతావరణం ఉంటుంది.

కానీ అల్లు అర్జున్ సినిమాను కేరళలోనూ ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల నాటి పాత సినిమాకు కేరళ ప్రజలు క్యూ కడుతున్నారు. అల్లు అర్జున్ సినిమాలోని పాటలకు థియేటర్ స్క్రీన్ ముందుకు వచ్చి డ్యాన్సులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హ్యాపీ మూవీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ 4K లో రీ- రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 20 ఏళ్ల కిందటి సినిమాకు మలయాళీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం.

ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో 'హ్యాపీ' సినిమా 2006లో మొదటిసారి రిలీజైన విషయం తెలిసిందే. ఆ రోజుల్లోనే ఈ సినిమా కేరళలో ఏకంగా 150 రోజులకు పైగా ఆడి సంచలనం సృష్టించింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ 4K టెక్నాలజీతో బిగ్ స్క్రీన్‌పైకి వచ్చింది. ఇప్పుడు కూడా మొదటిసారి చూస్తున్నంత ఉత్సాహంతో మలయాళీ ప్రేక్షకులు థియేటర్ల వద్ద అనుభూతి పొందుతున్నారు. అల్లు అర్జున్ మార్క్ కామిక్ టైమింగ్, మేనరిజమ్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కు మలయాళీలు విజిల్స్ వేస్తున్నారు.

AlluArjun Mania Sweeps Kerala Grand Festive Atmosphere for 20Year-Old Happy Re-Release AlluArjun

అయితే అల్లు అర్జున్ కు కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఆర్య, హ్యాపీ, బన్నీ, దేశ ముదురు సినిమాలు మలయాళ డబ్బింగ్ వర్షన్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ పై ప్రేమ మలయాళీ ప్రేక్షకులకు రెట్టింపు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+