Video: ఉపాధి హామీ కూలీల మైండ్ బ్లోయింగ్ డాన్స్. ఆనందం అంటే ఇదే!

ఉదయం నుంచి మండే ఎండలో మట్టితో కుస్తీ పట్టి.. చెమట చుక్కలను చిందిస్తూ దేశానికి వెన్నెముకగా నిలిచే శ్రమజీవుల కథ ఇది. చేతిలో పార పట్టి భూమిని దున్నిన ఆ చేతులే, సాయంత్రానికి జానపదానికి జీవం పోస్తూ లయబద్ధంగా కాలు కదిపితే ఎలా ఉంటుందో తెలంగాణ ఆడబిడ్డలు నిరూపించారు. జగిత్యాల జిల్లాలో ఉపాధి హామీ కూలీలు సృష్టించిన ఒక అద్భుత దృశ్యానికి కార్మిక లోక ఫిదా అయింది.

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శుక్రవారం ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. గ్రామంలో ఉపాధి హామీ పనుల కోసం ఉదయం నుంచే మహిళా కూలీలంతా రంగంలోకి దిగారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే మట్టి పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, సాయంత్రానికి పనులు ముగిసిన తర్వాత అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రోజంతా పడ్డ అలసటను, ఒంటి నొప్పులను పక్కనబెట్టి, తమలోని కళా ఉత్సాహాన్ని నృత్య రూపంలో బయటపెట్టారు.

Viral Video Energetic MGNREGA Female Workers Dance Defying Exhaustion In Jagtial Rural District
Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'తండా’ షష్ఠిపూర్తి!
Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'తండా’ షష్ఠిపూర్తి!

యువతకే సవాల్ విసిరే రేంజ్‌లో ఎనర్జీ!

పని ప్రదేశంలోనే ఒక సాటి కూలీ జానపద గీతాన్ని అందుకోగా.. మిగిలిన మహిళా కూలీలంతా చప్పట్లతో లయబద్ధంగా జతకలిశారు. వయసుతో నిమిత్తం లేకుండా, ముఖానికి కట్టుకున్న రుమాళ్లతోనే జానపద పాటలకు వారు వేసిన స్టెప్పులు చూసేవారిని మంత్రముగ్ధులను చేశాయి. నేటి తరం యువతకు కూడా సవాల్ విసిరేలా, అత్యంత వేగంగా, ఎనర్జీతో వారు వేసిన డాన్స్ మూమెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. మేమేం తక్కువ కాదు అన్నట్లుగా ఆ ఊరి ఆడబిడ్డలు వేసిన ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

Video: ఆకలి తీరాక 'పెద్దపులి’ వింత చేష్టలు.. మీరూ చూడండి
Video: ఆకలి తీరాక 'పెద్దపులి’ వింత చేష్టలు.. మీరూ చూడండి

కష్టాల నడుమ చిరునవ్వుల సందేశం

ఈ నృత్యం కేవలం వినోదం కోసం చేసింది కాదు.. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతటి శ్రమ ఎదురైనా వాటన్నింటినీ చిరునవ్వుతో దాటవచ్చు అనే ఒక గొప్ప సందేశాన్ని ఈ మహిళలు చాటిచెప్పారు. శ్రమను భారంలా కాకుండా, అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ పని ప్రదేశాన్ని ఒక పండుగ వాతావరణంగా మార్చేశారు. ఈ తిమ్మాపూర్ మహిళల నృత్యం చూసిన నెటిజన్లు.. "శ్రమజీవుల నిఖార్సయిన ఆనందం అంటే ఇదే" అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+