దేశరాజధానిలో తెలంగాణ బోనాల సంబరం(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తెలంగాణప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బోనాలు సంబురాలు దేశరాజధాని ఢిల్లీలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజా మహంకాళి సింహవాహిని అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న రెండు రోజుల బోనాల సంబరాలు శనివారం అమ్మవారి ఘట స్థాపనతో మొదలయ్యాయి.

తెలంగాణ భవన్ సమీపంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఘట స్థాపన ఊరేగింపు ప్రారంభమైంది. భవన్ చుట్టూ ఉన్న వీధుల గుండా సాగిన ఊరేగింపును ఢిల్లీ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తెలంగాణలో ఇలాంటి భావోద్వేగమైన కళారూపం ఉంటుందా? అని ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక విభాగం డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని హైదరాబాద్ నుంచి యాభై మందితో కూడిన బోనాలు, పోతరాజు, ఒగ్గుడోలు, డప్పుల కళాకారుల బృందాలను ఢిల్లీకి పంపారు. ఆలయ కమిటీలోని 21 మంది సభ్యులతో పాటు కార్యనిర్వాహకవర్గ సభ్యులు, భక్తులు సుమారు 150 మంది ఢిల్లీకి వచ్చారు.

బోనాల సంబరం

బోనాల సంబరం

తెలంగాణప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బోనాలు సంబురాలు దేశరాజధాని ఢిల్లీలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజా మహంకాళి సింహవాహిని అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న రెండు రోజుల బోనాల సంబరాలు శనివారం అమ్మవారి ఘట స్థాపనతో మొదలయ్యాయి.

బోనాల సంబరం

బోనాల సంబరం

తెలంగాణ భవన్ సమీపంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఘట స్థాపన ఊరేగింపు ప్రారంభమైంది. భవన్ చుట్టూ ఉన్న వీధుల గుండా సాగిన ఊరేగింపు ఢిల్లీ ప్రజలకు ఆసక్తి కలిగించింది. తెలంగాణలో ఇలాంటి భావోద్వేగమైన కళారూపం ఉంటుందా? అని ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

బోనాల సంబరం

బోనాల సంబరం

రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక విభాగం డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని హైదరాబాద్ నుంచి యాభై మందితో కూడిన బోనాలు, పోతరాజు, ఒగ్గుడోలు, డప్పుల కళాకారుల బృందాలను ఢిల్లీకి పంపారు. ఆలయ కమిటీలోని 21 మంది సభ్యులతో పాటు కార్యనిర్వాహకవర్గ సభ్యులు, భక్తులు సుమారు 150 మంది ఢిల్లీకి వచ్చారు.

బోనాల సంబరం

బోనాల సంబరం

ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు సుమారు గంటన్నరపాటు పలు వీధులగుండా సాగి తెలంగాణ భవన్‌కు చేరుకుంది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతోపాటు తెలంగాణ భవన్ ఉద్యోగులు, సిబ్బంది, నగరంలోని పలువురు తెలంగాణ ప్రజలు స్వాగతం పలికారు. రవికుమార్ నేతృత్వంలోని 15 మంది కళాకారులు ప్రదర్శించిన ఒగ్గుడోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బోనాల సంబరం

బోనాల సంబరం

శేఖర్ బృందం బోనాలతో చేసిన ఊరేగింపు, విజయ్‌కుమార్ బృందం ప్రదర్శించిన డప్పు నృత్యం అలరించాయి. ఈ సందర్భంగా మహంకాళి సింహవాహిని ఆలయ కమిటీ అధ్యక్షుడు సీ రాజ్‌కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించిందని, సాంస్కృతిక విభాగం ప్రత్యేక చొరవ తీసుకుని బృందాలను పంపిందని అన్నారు.

బోనాల సంబరం

బోనాల సంబరం

ఆదివారం ఉదయం 11 గంటలకు అమ్మవారికి బంగారు, వెండి బోనాల సమర్పణ ఉంటుందని, ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ తరఫున సలహాదారు మహేశ్‌గౌడ్, మాణిక్‌ప్రభు గౌడ్, విష్ణుకుమార్‌గౌడ్, సదానంద ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్ తరఫున సహాయ కమిషనర్ జీ రామ్మోహన్‌తో పాటు భవన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana’s official festival ‘Bonalu’ was celebrated with fervour in the national capital.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి