• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్రహ్మోత్సవాల్లో అద్భుతం: కాంతిపుంజం లీనం(పిక్చర్స్)

|

తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవంటేనే భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణ. అలాంటి గరుఢసేవ రోజున ఒక తేజో కిరణం ఉన్నట్లు చిత్రంలో కనపడింది. ఆ కాంతిని వీక్షించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. ఈ అద్భుత సంఘటన ఆదివారం గరుడోత్సవంలో వెలుగుచూసింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం రాత్రి 8గంటల ప్రాంతంలో స్వామివారు గరుడ వాహనంపై బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఆలయ డిప్యూటి ఈఓ చిన్నంగారి రమణ వాహనం ముందు నిలబడి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రమణదీక్షితులకు చెందిన సెల్‌ఫోన్‌తో రెండు ఫోటోలను తీయించుకున్నారు.

ఇక్కడే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక ఫోటో సాధారణంగా ఉన్నప్పటికీ, మరో ఫోటోలో గరుడ వాహనంపై ఉన్న స్వామి వారి స్థానంలో ఆయన పాదాల నుంచి నుదుట వరకు ఒక శ్వేత వర్ణంలో తేజో కిరణం ఉన్నట్లు చిత్రంలో కనపడింది. ఈ తేజో కిరణానికి ఇరువైపులా స్వామివారి మెడలో ధరింపజేసిన లక్ష్మీ వెంకటేశ్వర సహస్రనామహారం ఉండటంతో ఆ రూపం తిరు నామంగా ఆవిష్కృతమైంది.

అయితే ఈ విషయాన్ని వాహనసేవ హడావిడిలో రమణదీక్షితులు కూడా గమనించలేదు. గరుడసేవ ముగిసిన తరువాత వారు తీసుకున్న ఫోటోలను గమనిస్తున్నప్పుడు ఈవిషయం బయటపడింది. ఇదే విషయాన్ని ఆయన మీడియాకు తెలియజేశారు. సెల్‌ఫోన్‌లో ఉన్న ఫ్లాష్ ద్వారా ఈ వెలుగు వచ్చిందా అన్న అనుమానాలు కూడా అందరిలో తలెత్తాయి. ఫ్లాష్ అయితే ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైన గుండ్రని ఆకృతిలో కాంతి కనపడుతుంది.

లీనమవుతున్న కాంతిపుంజం

లీనమవుతున్న కాంతిపుంజం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవంటేనే భక్తుల్లో ప్రత్యేక ఆకర్షణ. అలాంటి గరుఢసేవ రోజున ఒక తేజో కిరణం ఉన్నట్లు చిత్రంలో కనపడింది. ఆ కాంతిని వీక్షించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. ఈ అద్భుత సంఘటన ఆదివారం గరుడోత్సవంలో వెలుగుచూసింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరవరోజైన సోమవారం ఉదయం 9 నుంచి 11గంటల వరకు హనుమంతుని వాహనంపై ఆదిదేవుడైన శ్రీవేంకటేశ్వరుడు ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

వరదహస్తం దాల్చిన వేంకటాద్రిరాయుడు హనుమద్వాహనంపై భక్తిపారవశ్యాన్ని ఎల్ల లోకాలకు చాటి చెప్పారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

బుద్ధి, బలం,యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయని భక్తుల విశ్వాసం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల గిరులకున్న అనేక పేర్లలో అంజనాద్రి కూడా ఒకటికావడం విశేషం. నిత్య సేవా కైంకర్యాలన్నీ పూర్తయిన తరువాత మలయప్పస్వామిని అర్చకస్వాములు సర్వాలంకారభూషితుడ్ని చేసి హనుమంత వాహనంపై స్వామిని అధిరోహింపజేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ముందు భజన బృందాలు, వేదపండితులు నడుస్తుండగా మంగళవాయిద్యాల మధ్య

చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఇదిలావుండగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన సోమవారం సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు శ్రీపతి తన ఉభయదేవేరులతో కలిసి స్వర్ణ రథంపై ఊరేగుతూ తన దర్శనం కోసం వచ్చిన భక్తులకు అభయప్రదానం చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వర్ణరథం ముందుకు సాగింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

వాహనం ముందు భాగాన బ్రహ్మరథంతోపాటు జీయర్లు వేద పారాయణ చేస్తుండగా భజన,కోలాట,కులుకు నృత్యాలతో, హరినామ సంకీర్తనలతో స్వామివారి స్వర్ణరథోత్సవ సేవ అత్యంత వైభవంగా జరిగింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

సాయంత్రం 5-6 గంటల మధ్య ఆలయం నుంచి ఉత్సవర్లను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వర్ణ రథంపై ఆసీనులను చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం స్వామివారు హనుమంత, గజవాహనాలపై ఊరేగడంతోపాటు స్వర్ణ రథంపై చిద్విలాసం చిందించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీరామచంద్రుడై హనుమంత వాహనం మీద, రాజాధిరాజుగా గజ వాహనారూఢుడై శ్రీవారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

అలా కాకుండా ఆ కాంతి నిలువుగా ఉండటం చర్చనీయాంశమైంది. అయితే మరికొంత మంది ఈ చిత్రంపై మరో కోణంలో పరిశీలించారు. అదేమిటంటే వాహనసేవ ఊరేగింపు ముందే తిరుమల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఈసందర్భంగా మెరుపుకాంతి స్వామి విగ్రహాన్ని తాకి ఉంటుందని వాదించారు.

అయితే సెల్‌ఫోన్‌తో చిత్రాన్ని తీసింది వాహన మండపంలో కావడంతో మెరుపుకాంతి వాహనంపై ప్రసరించే అవకాశం లేదని ఇది స్వామివారి మహిమేనంటు మరికొందరు వాదించారు. ఇదే అంశంపై ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రమణ దీక్షితులు మాట్లాడుతూ.. ఇది శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత పవిత్రంగా జరుగుతున్న నేపథ్యంలో స్వామివారి మహిమతో ఏర్పడ్డ తేజోకాంతి కిరణమన్నారు.

కాగా, గరుడసేవనాడు ధృవమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామికి, ఉత్సవమూర్తి శ్రీమలయప్పస్వామికి భేదం లేదన్నది పురాణాలు చెబుతాయి. ఈ విశ్వాసంతోనే బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సమస్త ఆభరణాలతోపాటు ఆనందనిలయంలోని స్వామివారు బయటకు వచ్చి గరుడ వాహనంపై ఊరేగుతారనే నమ్మకం భక్తకోటిలో ఉంది.

ఆ నమ్మకాన్ని నిజం చేస్తున్నట్లు ఈ కాంతి పుంజం శ్రీమలయప్పస్వామిలో లీనమవుతున్నట్లు చిత్రంలో స్పష్టంగా కనిపించింది. భక్తులను స్వయంగా అనుగ్రహించడానికి దేవదేవుడు శ్రీమలయప్పస్వామిలో ప్రత్యక్షమయ్యారని ప్రధాన అర్చకులు వివరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Garlands and flowers play a significant role in the history of Tirumala, and each one has a specific identity in the lore of the temple of Lord Venkateswara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more