వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2017 గ్రహణాలు ఏర్పడే సమయాలివే

ఈ ఏడాది ఫిబ్రవరి,ఆగష్టు మాసాల్లో గ్రహణాలు ఏర్పడనున్నాయి. కొన్ని గ్రహణాలు పాక్షికంగానూ. కొన్ని పూర్తిగాను కన్నించే అవకాశాలున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2017 సంవత్సరంలో ఎప్పుడూ సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడుతాయో తెలుసా, ఏ ప్రాంతంలో ఇవి కన్పిస్తాయో చూద్దాం.ఈ ఏడాది ఏ సమయంలో ఈ గ్రహణాలు ఏర్పడుతాయో తెలుసుకొందాం.

ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదిల్లో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. అయితే ఈ గ్రహణాన్ని ఇండియాతో పాటు యూరప్ ఆసియా,,ఆఫ్రికా ఉత్తర ఆమెరికా, దక్షిణ అమెరికా, ఫసిఫిక్, అట్టాంటిక్ ,హిండూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పాక్షికంగా కన్పిస్తోంది.ఇండియాలో ఈ గ్రహణం మాత్రం ఫిబ్రవరి 11వ, తేది ఉదయం నాలుగు గంటల 4 నిమిషాల 14 సెకన్లకు ప్రారంభం కానుంది. పూర్తిస్థాయిలో గ్రహణం 6 గంటల 13 నిమిషాల 49 సెకన్లకు కన్పిస్తోంది. ఈ గ్రహణం అదే రోజు 8 గంటల 23 నిమిషాల 25 సెకన్లకు పూర్తికానుంది.

ఫిబ్రవరి మాసంలోనే సూర్య గ్రహణం ఏర్పడుతోంది. చంద్ర గ్రహణం ఏర్పడిన రెండు వారాల తర్వాత సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం ఫిబ్రవరి 26వ,తేదిన ఏర్పడుతోంది.ఈ గ్రహణం పాక్షికంగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికాలో కన్పిస్తోంది. ఫసిఫిక్, అట్టాంటిక్, హిందూ మహసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల్లో కన్పిస్తోంది.

when Solar and Lunar Eclipse will appear in 2017

సూర్య గ్రహణం ఫిబ్రవరి 26వ, తేదిన సాయంత్రం ఐదు గంటల 40 నిమిషాలకు ప్రారంభం కానుంది. పూర్తి స్థాయిలో గ్రహణం సాయంత్రం ఆరుగంటల 45 నమిషాలకు ఏర్పడనుంది. ఈ గ్రహణం రాత్రి పూట 11 గంటల ఐదు నిమిషాలకు పూర్తి కానుంది.

ఈ ఏడాది ఆగస్టు మాసంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ఆగష్టు 7 లేదా 8వ, తేదిల్లో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహాణాన్ని యూరప్ తో పాటు ఆసియా అస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాల ప్రజలు ఫసిఫిక్ , అట్లాంటిక్ , హిందూ మహాసముద్రం, అర్కిటిక్ ప్రాంతాల్లో కన్పిస్తోంది.

ఇండియాలో కన్పించే సమయాలు

ఈ గ్రహణం ఇండియాలో సుమారు ఐదు గంటల ఒక్క నిమిషం పాటు ఉంటుంది. ఈ గ్రహణం పాక్షికంగా గంట 53 నిమిషాల సేపు ఉంటుంది.అయితే ఆగష్టు ఏడవ తేదిన ఏర్పడే సూర్యగ్రహణం రాత్రిపూట 9 గంటల 20 నిమిషాల ఒక్క సెకన్ కు ఇండియాలో కన్పిస్తోంది.పాక్షికంగా పదిగంటల 52 నిమిషాల 56 సెకస్ల వరకు ఉంటుంది. పూర్తి స్థాయిలో రాత్రిపూట పదకొండుగంటల 50నిమిషాల 29సెకన్లకు కన్పిస్తోంది.మరునాడు అంటే ఆగష్టు 8వ, తేది ఉదయం వరకు పాక్షికంగా కన్పిస్తోంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల 56 సెకస్లకు గ్రహణం పూర్తి కానుంది..

ఆగష్టులో పూర్తిస్థాయిలో గ్రహణం

2017 ఆగస్టు 21 వ, తేదిన పూర్తిస్థాయిలో సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహాణాన్ని యూరప్, ఉత్తర, తూర్పు ఆసియా, నార్త్, పశ్చిమ అఫ్రికా, నార్త్ అమెరికా,దక్షిణ అమెరికా, ఫసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ లలో కన్పిస్తోంది. ఈ గ్రహణం తొలిసారిగా అమెరికాలో కన్పిస్తోంది.1అయితే అలాస్కా, హవాయ్ మినహాయించి అమెరికా అన్ని ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం తొలిసారిగా కన్పించనుంది. గతంలో 1979 లో ఈ గ్రహణం పూర్తిస్థాయిలో కన్పించింది.

ఈ గ్రహణం ఐదు గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది.అయితే గ్రహణం మాత్రం 3 గంటల 13 నిమిషాల పాటు ఉండనుంది. ఆగష్టు 21వ, తేది రాత్రి తొమ్మిది గంటల 16 నమిషాలకు గ్రహణం ప్రారంభం కానుంది. గ్రహణం ప్రారంభమైన ప్రాంత ప్రజలకు పది గంటల 18 నమిషాలకు గ్రహణం కన్పిస్తోంది. చివరి ప్రాంతాల్లో ఉన్న వారికి ఆగష్టు 22వ, తేది ఉదయం 01.32 గంటలకు పూర్తి స్థాయిలో కన్పిస్తోంది. ఈ గ్రహాణం పాక్షికంగా అదే రోజు తెల్లవారుజామును రెండుగంటల 34 నిమిషాలకు వారికి కన్పిస్తోంది.

English summary
Regions seeing, at least, some parts of the eclipse: Europe, Much of Asia, Africa, North America, South America, Pacific, Atlantic, Indian Ocean, Arctic, Antarctica.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X