నవీన్ బోర్డులో సబీర్‌బాటియా
న్యూయార్క్‌ఃభారతీయ స్వాతంత్ర్య ఉత్సవాలు ఇక్కడ ఆదివారంఇక్కడ ఘనంగాజరిగాయి. నిజానికి ఆగస్టు 15న ఈ ఉత్సవాలుజరగవలసి ఉన్నా సెలవు దినమైనఆదివారం నాడు వేలాది భారతీయులు జెండాపండుగ జరుపుకున్నారు. నటీమణులు
జయప్రద, రేఖ, రవీనా టాండన్, రాజ్ బబ్బర్,రణధీర్ కపూర్ పాల్గొన్న ఈ ఉత్సవాలకు వేలాదిమంది హాజరయ్యారు. త్రివర్ణ పతాకాల రెపరెపలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్నితలపింపజేసింది. అంతకు ముందు మెడిసన్‌ఎవెన్యూ మీదుగా ఊరేగింపు జరిగింది.సాధారణంగా ఆదివారాల్లో నిర్మానుష్యంగా కన్పించేవీధులు ఆ రోజు జన సముద్రంతో నిండిపోయాయి.భారత్ మాత కి జై, జై హింద్ అనే నినాదాలుమిన్ను ముట్టాయి. ఎంత మంది జనం హాజరయ్యారోఅధికారిక
లెక్కలేమీ లేనప్పటికీ పది నుంచి పదిహేనువేల మంది హాజరయ్యారని వాలంటీర్లు
తెలిపారు.












Click it and Unblock the Notifications
