బాబుకు కెసిఆర్ దూరం?

ఇదిలావుంటే, కోస్తా కారిడార్ కు నిరసనగా విశాఖపట్నంలో సిపిఐ తలపెట్టిన మహాధర్నాకు చంద్రబాబుతో పాటు కెసిఆర్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఈ మహాధర్నాకు కెసిఆర్ ప్రత్యేక ఆకర్షణ అంటూ వార్తలు వచ్చాయి. కెసిఆర్ ఈ విషయంలో ప్రధాన ఆకర్షణ శక్తి అయ్యారు. దీంతో చంద్రబాబు మనసు నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహాధర్నాకు వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తమ పార్టీ తరఫున దాడి వీరభద్రరావును, అయ్యన్నపాత్రుడులను పంపుతున్నారు. కెసిఆర్ తో పెరిగిన దూరం, కెసిఆర్ కు లభిస్తున్న ప్రాధాన్యం వల్లనే చంద్రబాబు ఈ మహాధర్నాకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు వెళ్లడంలేదని తెలియడంతో కెసిఆర్ విశాఖ పర్యటన కూడా సందిగ్ధంలో పడింది. ప్రత్యేకమైన కాన్వాయ్ గా కెసిఆర్ విశాఖపట్నం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాజా పరిణామాలతో ఆయన పర్యటనపై కూడా అనుమానాలు బయలుదేరాయి. మరో వైపు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు కూడా వెళ్లడం లేదు. తాను వెళ్లడానికి ఇతరేతర కారణాలు ఏవీ లేవని, ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల వైద్యుల సలహా మేరకు తాను వెళ్లడం లేదని రాఘవులు చెబుతున్నారు. మొత్తం మీద, కాంగ్రెసుకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల్లో ఎప్పటికప్పుడు విభేదాలు పొడసూపుతున్న సూచనలే కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications