గెంతులు: 'చిరు' వ్యూహం

Chiranjeevi
కాంగ్రెసు పార్టీకి పలువురు నేతలు దూరమవుతున్నారు. దాదాపు 120 మంది కొత్తవాళ్లకు కాంగ్రెసు పార్టీ టికెట్లు ఇచ్చింది. తమకు టికెట్లు వస్తాయని ఏనాడూ అనుకోనివారిని కూడా టిక్కెట్లు దక్కాయి. ఈ స్థితిలో చాలా మంది సీనియర్లు పార్టీకి దూరమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని తమ పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చే కొత్త వ్యూహాన్ని చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ అనుసరిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా అభ్యర్థుల జాబితా వెల్లడిని ఆ పార్టీ ఆపి ఉంచింది. తాజాగా విజయనగరం జిల్లా పెన్మత్స సాంబశివ రాజును పార్టీలోకి ఆహ్వానించింది. కోరుకున్న విజయనగరం లోకసభ సీటును ఆయనకు కట్టబెట్టింది. విజయనగరం లోకసభ సీటును తనకు కాకుండా తన శిష్యుడు, మంత్రి బొత్సా సత్యనారాయణ భార్య బొత్సా ఝాన్సీకి ఇవ్వడంతో కలత చెందిన సాంబశివరాజు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు.

ఇకపోతే చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి సిట్టింగ్ శాసనసభ్యుడు కె. ప్రభాకర రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గురువారం ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని మంత్రి గొల్లపల్లి సూర్యారావు కూడా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఎటు పోతారనే విషయం ఇంకా తేలలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ బలపడుతోంది. కృష్ణంరాజు ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో పశ్చిమ గోదావరిలో ప్రజారాజ్యం పార్టీ మరింత బలపడింది. ప్రజారాజ్యం పార్టీ వల్ల తీవ్రంగా బిజెపి దెబ్బ తింది. దీంతో కృష్ణం రాజు బిజెపిని వదిలేసి ప్రజారాజ్యంలోకి వచ్చారు.

తెలుగుదేశం పార్టీలోనూ అసమ్మతి చిచ్చు రేగుతోంది. తాను ఆశించిన సనత్ నగర్ సీటును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు కేటాయించడంతో అసంతృప్తికి గురైన మాజీ శాసనసభ్యుడు శ్రీపతి రాజేశ్వర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. శ్రీపతి రాజేశ్వర్ అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు. నందమూరి కుటుంబానికి సన్నిహితులు. తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఆదిలాబాదు జిల్లాలో ఈ అసంతృప్తి జ్వాలలు తీవ్రంగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+