కాంగ్రెసుకు కెసిఆర్ చేయూత?

తనకు బలం లేని నాంపల్లి వంటి సీట్లు, సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి వంటి సీట్లు తీసుకోవడంలో ఆయనకు కాంగ్రెసు అభ్యర్థులను గెలిపించే ఆలోచన ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలోని శాసనసభా స్థానాల్లో అలాంటి పనికే ఆయన ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఆయన అలాగే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ టిక్కెట్లు అమ్ముకున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలను చంద్రశేఖర రావు ఖండిస్తున్నారు. కాంగ్రెసును ఓడించడమే తన ప్రధాన ధ్యేయమని, తెలంగాణను దగా చేసిన కాంగ్రెసుపై ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన అంటున్నారు.
డబ్బులు తీసుకుని టిక్కెట్ తెచ్చుకున్నట్లు సికింద్రాబాద్ లోకసభ అభ్యర్థి వెంకట రెడ్డి ప్రకటించడంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో ఆయన అభ్యర్థిని మార్చారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమీషన్ కెసిఆర్ ను వివరణ కూడా కోరింది. కాంగ్రెసును గెలిపించడానికి తెరాస బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టారనే ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కెసిఆర్ తో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు తెరాసకు కేటాయించిన కొన్ని సీట్లలో తమ అభ్యర్థులకు బీ - ఫారాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications