పవన్ మనస్తాపం?

మొదట్లో ప్రజారాజ్యం పార్టీ కోసం తీవ్రంగా ప్రచారం చేసిన నాగబాబు ఆ తర్వాత చాలా వరకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధినేతగా అన్నయ్యను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టాలని తపన పడ్డారు. పవన్ కళ్యాణ్ తన మిత్రులకు కొద్ది మందికి టిక్కెట్లు ఇప్పించుకున్నప్పటికీ పార్టీ పరిణామాలు ఆయనకు రుచించడం లేదని అంటున్నారు. హైదరాబాదులో ప్రచారం చేస్తూ అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
చిరంజీవి తలపెట్టిన ప్రజారాజ్యం ప్రజా రైలు యాత్రలో పవన్ కళ్యాణ్ కూడా వుంటారని చిరంజీవి చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ రైలు యాత్రలో లేరు. పార్టీ పరిస్థితి రుచించకనే ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. రెండో దశ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసే అవకాశాలు లేవని కూడా భావిస్తున్నారు. ఎన్నికలు అయిపోగానే తిరిగి తన సినీ జీవితంలో బిజీ కావాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
స్వతహాగా ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ కు ఉన్నదున్నట్లు సూటిగా మాట్లాడడం అలవాటు. రాజకీయాలను కూడా ఆయన సూటిగానే చూశారు. దాంతో దానిలో వక్రరీతులు అర్థం కావడం లేదు. అర్థమయ్యే సరికి పీక లోతు మునిగిపోయినట్లు అయింది. దాంతో ఆయన పూర్తిగా విసిగిపోయినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications