కెసిఆర్ ఎదురీత

మహబూబ్ నగర్ జిల్లాలో తెరాసకు అంతగా బలం లేని లేని విషయం తెలిసిందే. కోరి కోరి తాను ఆ సీటును ఎన్నుకుని దక్షిణ తెలంగాణలో పార్టీని విస్తరింపజేసే ఆయన ప్రయత్నాలు ఎంత వరకు నెరవేరుతాయో చెప్పడం కష్టమే. ప్రస్తుతం ఆయన మహబూబ్ నగర్ లో ఏటీకి ఎదురీదుతున్నారు. దాంతో ఆయన మహబూబ్ నగర్ లో విస్తృతంగా పర్యటించారు. ఆయన కూతురు కవిత అక్కడే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారంనాడు మహా కూటమి సమావేశం కూడా తలపెట్టారు. ఈ ప్రయత్నాలు ఆయనను గట్టెంచకడం అంత సులభమేమీ కాకపోవచ్చు.
మహబూబ్ నగర్ లోకసభ సీటును ఆశించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చింది. కెసిఆర్ కు జితేందర్ రెడ్డి నుంచి తగిన సహాయం అందడం లేదని తెలుస్తోంది. కెసిఆర్ విజయానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి కూడా సవాల్ వంటిదే. ఈ స్థానంలో కెసిఆర్ ఓడిపోతే చంద్రబాబుపై విమర్శలు వెల్లువెత్తవచ్చు. దాంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కెసిఆర్ విజయానికి కృషి చేసేలా చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏమైనా, చంద్రశేఖరరావు ఏటికి ఎదురీది గట్టెక్కితే అదొక ఘన కార్యసాధనే అవుతుంది. అంతేకాకుండా దక్షిణ తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి ఊపు వస్తుంది.












Click it and Unblock the Notifications