చంద్రబాబుపై ముప్పేట దాడి

కాంగ్రెసు పార్టీకి మొదటి నుంచీ చంద్రబాబు ప్రధాన శత్రువు. దాని వల్ల కాంగ్రెసు నుంచి ఆయనకు అన్ని వైపుల నుంచి దాడి ఎదరువతూనే ఉన్నది. బాబ్లీ ఉద్యమం చేపట్టినా, మైనింగ్ మాఫియాపై రాజకీయ పోరాటానికి దిగినా, ఇవియంలపై యుద్ధం ప్రకటించినా తొలుత ఆశావహంగా కనిపిస్తున్నప్పటికీ చివరికి అవి చంద్రబాబుకు వ్యతిరేకంగానే పరిణమిస్తున్నాయి. అవి తగిన ఫలితాలు ఇవ్వడం లేదు. చంద్రబాబుకు ఎప్పటికప్పుడు కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వమే కాకుండా ఢిల్లీ నాయకత్వం కూడా కౌంటర్ వ్యూహాలను రూపొందించి అమలు చేస్తూనే ఉన్నది. కాంగ్రెసు ఎత్తులను, జిత్తులను తిప్పి కొట్టడం ఎలాగో చంద్రబాబుకు తెలియడం లేదు. కేవలం మీడియా ద్వారా కాంగ్రెసును ఎదుర్కోవడం చంద్రబాబుకు సాధ్యం కావడం లేదు. దానికి తోడు, వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వార్తాకథనాలను ప్రచురిస్తూనే ఉన్నది.
కాంగ్రెసు దగ్గరవుతున్న ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చంద్రబాబునే ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు. తమ పార్టీని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు వైఖరులను తూర్పార పడుతున్నారు. ఎన్నికల్లో ప్రజారాజ్యం వల్లనే తాము అధికారంలోకి రాలేకపోయామనే అంచనాకు వచ్చిన చంద్రబాబు ప్రజారాజ్యం పార్టీని తన లక్ష్యంగా ఎంచుకున్నారు. పార్టీ వీడిపోయినవారిని తిరిగి పార్టీలో చేర్చుకునే ఎత్తుగడను ఆయన అనుసరించారు. అయితే, అది కొంత కాలం జోరుగా సాగి ఆగిపోయింది. ఈ స్థితిలో కాంగ్రెసుకు దగ్గరై కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీయే లక్ష్యంగా చిరంజీవి పనిచేస్తున్నారు. చిరంజీవి వల్ల కోస్తాంధ్రలో తెలుగుదేశం ఓట్లు గణనీయంగా చీలే ప్రమాదం కూడా ఉంది.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా చంద్రబాబుపై నిత్యపోరాటం సాగిస్తున్నారు. మాటకు మాట అంటూ చంద్రబాబును మానసింగా ఓడించి, తెలంగాణ నాయకుల మానసిక స్థయిర్యాన్ని దెబ్బ తీసే పనికి ఆయన పూనుకున్నారు. తెలంగాణపై వైఖరి వల్ల చంద్రబాబు తెలంగాణలో చంద్రబాబు కోలుకోలేని స్థితి ఏర్పడింది. మొత్తంగా చంద్రబాబు విశ్వసనీయత ప్రమాదంలో పడింది. పార్టీలో నాయకులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారే గానీ పునాది స్థాయిలో పనిచేయడం లేదు. అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతుండడంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.












Click it and Unblock the Notifications