జగన్ పై కెసిఆర్ కుట్ర?

ఆ వార్తా కథనం ప్రకారం - జగన్ ఓదార్పు యాత్ర అనుమతి లభించిన వెంటనే కెసిఆర్ కేశవరావుకు ఫోన్ చేశారు. కేశవరావు కాంగ్రెసు నేతలకు, తెలంగాణ పార్లమెంటు సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. అంతేకాకుండా జైపాల్ రెడ్డి, హనుమంత రావులకు ఫోన్ చేసి ఓదార్పు యాత్రను ఆపించేందుకు అధిష్టానంపై ఒత్తిడి తేవాలని కోరారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా అధిష్టానం పెద్దలతో మాట్లాడి యాత్ర ఆపించాలని కోరారు. ఆ ప్రతిపాదన తమ నుంచి వస్తే బాగుండదని వారు రోశయ్యకు చెప్పారు. దాంతో ఆ వెంటనే మంత్రులు, జెసి దివాకర్ రెడ్డి వంటి కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు రంగంలోకి దిగి జగన్ వ్యవహారశైలిని తప్పు పడుతూ ప్రకటనలు చేశారు.
రోశయ్య మాట్లాడడం, మంత్రులు, శాసనసభ్యులు ప్రకటనలు చేయడం, హైదరాబాద్ నుంచి అధిష్టానానికి ఫాక్స్ లు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. దీంతో వ్యవహారం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ దృష్టికి వచ్చింది. ఆయన మొయిలీతో మాట్లాడి విషయాన్ని సోనియాకు వివరించారు. సోనియా ఆదేశాలు రావడంతో మొయిలీ మంగళవారం సాయంత్రం ప్రకటన చేశారు. జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఇలా సాయంత్రంలోగా జగన్ జాతకం తిరగబడింది.












Click it and Unblock the Notifications