వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ జెఎసికి ఎసరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

JAC
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ఉనికి ప్రమాదంలో పడింది. తాజాగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ప్రకటించిన నేపథ్యంలో పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో రాజకీయ జెఎసి నుంచి తప్పుకోవడానికి కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. జెఎసి ద్వారా కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకులను తమకు అనుగుణంగా తిప్పుకునే కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలనే వ్యూహానికి విఘాతం కలిగినట్లే భావిస్తున్నారు. విధివిధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే ఉద్యమించడానికి అందరి కన్నా తాము ముందుంటామని చెబుతూ వచ్చిన కాంగ్రెసు తెలంగాణ నాయకులు మారు మాట్లాడడం లేదు. అయితే వారు ఏం చేయాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెసు నాయకులు శనివారం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.

జెఎసిలో కాంగ్రెసును తిప్పలు పెట్టడానికి ఎప్పటికప్పుడు తెలుగుదేశం తెలంగాణ నాయకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీరుపై కూడా వారు విమర్శలు చేస్తున్నారు. జెఎసి నిర్ణయాలకు అనుగుణంగా అన్ని పార్టీలు ముందుకు సాగాలనే నిర్ణయాన్ని కాదని తెరాస అధ్యక్షుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. జెఎసి కన్వీనర్ కోదండరామ్ జోక్యంతో తెరాస రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గింది. కానీ జెఎసి సమావేశానికి కాంగ్రెసు పార్టీ వస్తుందా, రాదా అనేది అనుమానంగానే ఉంది.

కాంగ్రెసులోని తెలంగాణ నాయకులు సగం మంది శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను సమర్థిస్తుండగా, సగం మంది వ్యతిరేకిస్తున్నారు. విధివిధానాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు నాయకులు కూడా పార్టీ అధిష్టానానికి ఎదురు తిరగగలుగుతారా అనేది సందేహంగానే ఉంది. సీమాంధ్ర నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆర్ దామోదర్ రెడ్డి కూడా ఇప్పుడు పెద్దగా మాట్లాడడం లేదు. జెఎసిలో తొలుత క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె. జానారెడ్డి పూర్తిగా వెనక్కి తగ్గినట్లే. అయితే, కాంగ్రెసు నాయకులు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని ఎలా తట్టుకుంటారనేది సందేహంగానే ఉంది. రాజీనామాలు చేయాలని తెలంగాణ ప్రజా ప్రతినిధులందిరి మీదా ఒత్తిడి పెరుగుతోంది. శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబును వరంగల్ జిల్లాలో చుట్టుముట్టి నానా తిప్పలు పెట్టారు. అలాగే పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ను కూడా ఘెరావ్ చేశారు. అయితే, శ్రీధర్ బాబు తనపై దాడికి తెరాసను లక్ష్యంగా ఎంచుకున్నారు. కాంగ్రెసు పార్టీ తెరాసపై విమర్శల దాడికి పూనుకునే ఎత్తుగడను ఎంచుకుని, పోలీసులతో ప్రజాప్రతిఘటనను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుందా అనేది తెలియడం లేదు.

కాగా, జెఎసి కన్వీనర్ కోదండరామ్ పై కూడా ఒత్తిడి పెరుగుతోంది. రెడ్డి కులానికి చెందిన కోదండరామ్ జెఎసికి నాయకత్వం వహించడాన్ని మాదిగ దండోరా నాయకుడు మందకృష్ణ మాదిగ వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు శనివారం తెలంగాణ యూత్ ఫోర్స్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ల్ లోని రాజకీయ జెఎసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. ప్రజాప్రతినిధుల చేత రాజీనామా చేయించలేని కోదండరామ్ జెఎసి కన్వీనర్ పదవి నుంచి తప్పుకోవాలని యూత్ ఫోర్స్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేయడానికి సుముఖంగా లేరు. ఈ స్థితిలో రాజకీయ జెఎసి ఉనికి ప్రమాదంలో పడినట్లే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X