చిరుకు 'తమ్ముడు' దూరమే!

Pawan Kalyan
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తమ్ముళ్లను దూరం చేసుకున్నట్లే ఉంది. ప్రజారాజ్యం పార్టీ నడుస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న నాగబాబు, పవన్ కళ్యాణ్ తమ పనేదో తాము చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక పూర్తిగా సినిమాలపై తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆయన ప్రస్తుతం పులి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కావస్తోంది. దీంతో మరో సినిమాలో నటించడానికి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. విజయభాస్కర్ దర్శకత్వం వహించే సినిమాలో నటించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథను సమకూరుస్తున్నారు. హిట్ జంట విజయభాస్కర్, త్రివిక్రమ్ తిరిగి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు కలిసి పని చేసేందుకు సిద్ధపడ్డారు.

అన్నయ్య చిరంజీవిని ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని కలలు గన్న పవన్ కళ్యాణ్ అది సమీప భవిష్యత్తులో కనిపించకపోవడంతో పూర్తిగా రాజకీయాలపై విసుగు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ అధికారాన్ని చేపట్టే దిశగా ఆలోచన చేయకపోవడం అతన్ని ఆగ్రహానికి గురి చేసినట్లు చెబుతున్నారు. అధికార రాజకీయాల్లో అధికారం ఇతరులకు అప్పగించే విధంగా మాత్రమే చిరంజీవి వ్యవహరించడం ఆయనకు ఇష్టంగా లేనట్లు తెలుస్తోంది. ఇందులో నిర్మాత, చిరంజీవ బావ మరిది అల్లు అరవింద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం పార్టీని రాష్ట్రంలో అధికారాన్ని అంది పుచ్చుకునే దిశగా నడిపించడం కన్నా ఇతరేతర ప్రయోజనాలే ముఖ్యమని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పార్టీలో పని చేసి నిరాశ చెందడం కన్నా సినిమాలను నమ్ముకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు భావిస్తున్నారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసుకు, తెలుగుదేశం పార్టీకి ధీటుగా నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ కలల కన్నారు. దాంతో ఆయన దూకుడుగా వెళ్లాడు. కాంగ్రెసు పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే, తన వైఖరికి భిన్నంగా చిరంజీవి కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తూ రావడంతో పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ కు కలిగినట్లు చేస్తోంది. అన్నయ్య రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే దిశగా పని చేయడం లేదని ఆయన నమ్ముతున్నట్లు కూడా తెలుస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు, ప్రజారాజ్యం పార్టీకి పూర్తిగా దూరం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+