జైపాల్ రెడ్డిపై నెగెటివ్ కాంపైన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రి రోశయ్య తటస్థంగా ఉన్నారని, అయితే జైపాల్ రెడ్డి పని కట్టుకుని నిరుడు డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామనే ప్రకటన చేయించారని రోశయ్య వర్గం దుమ్మెత్తిపోస్తోంది. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడం వల్లనే రాష్ట్రం భగ్గుమంటోందని, అందుకు ప్రధాన కారణం జైపాల్ రెడ్డేనని ప్రచారం సాగిస్తున్నారు. జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే మరిన్ని సమస్యలు తలెత్తుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.
పైగా, జైపాల్ రెడ్డికి అంత స్థాయి లేదని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆమంచి లాగా రోశయ్యకు అత్యంత సన్నిహితులైన ద్వితీయ శ్రేణి నాయకులు వడ్డే ప్రసాద్ వంటివారితో జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తాను ఎప్పుడంటే అప్పుడు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోతానని రోశయ్య అన్నా అందుకు ఆయన సుముఖంగా లేరని చెబుతున్నారు. అధిష్టానం చెప్తే దిగిపోతారనేది వేరే విషయం అయినా ప్రస్తుత పద్ధతిలోనే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే, జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications