వైయస్ భారం!

YS Rajasekhar Reddy
ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ విషయంలో ఒక్క రోజులో కాస్తా పరిస్థితి మారింది. మంత్రివర్గ విస్తరణకు పూర్తిగానే బ్రేకులు పడినట్లు బుధవారం వార్తలు రాగా, మంత్రివర్గ మార్పులు ఉంటాయని గురువారం వార్తలు వెలువడ్డాయి. ఒక్క రోజులో ఏం మారిందనేది ప్రశ్న. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు అనుమతి తీసుకోవడానికి తనను కలిసిన రోశయ్యను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సరిగా చూడలేదని, మంత్రివర్గంలో మార్పులకు అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. అయితే, మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరిగిందా అని మాత్రమే సోనియా అడిగినట్లు, దానిపై పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. దాంతో రోశయ్య మొయిలీని కలిశారు. మొయిలీ అంతా తన చేతులోనే ఉన్నట్లు మంత్రివర్గ విస్తరణను ఆపే ప్రయత్నం చేశారని అంటారు. అయితే రోశయ్య గురువారం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను, మొయిలీని కలిశారు. దీంతో మంత్రివర్గ విస్తరణకు సానుకూల స్పందన లభించింది.

మంత్రివర్గంలో మార్పులు చేయడానికి రోశయ్య కంకణబద్దుడై ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం - వైయస్ మార్కు మంత్రివర్గానికి స్వస్తి చెప్పడమే. సమర్థులైనవారిని మంత్రివర్గంలో వైయస్ రాజశేఖర రెడ్డి చేర్చుకోలేదనేది రోశయ్య ప్రధానమైన అభ్యంతరమని అంటారు. మంత్రులు ఫైళ్లు చూడడం లేదని, చాలా మందికి శాఖలకు సంబంధించిన అవగాహన కూడా లేదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారిని చూసి వైయస్ మంత్రివర్గంలో చేర్చుకున్నారని, దానివల్ల తన ఏకఛత్రాధిపత్యం నడుస్తుందనేది ఆయన ఉద్దేశమని అంటారు. పైగా, ప్రస్తుతం సీమాంధ్ర మంత్రులు తెలంగాణలో, తెలంగాణ మంత్రులు సీమాంధ్రలో పర్యటించే పరిస్థితి లేదని, అసమర్థులతో పరిపాలన సాగించడం కష్టమని రోశయ్య సోనియాతో చెప్పినట్లు సమాచారం.

మొదటి సారి వైయస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బలహీనమైనవారిని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. తదుపరి ఎన్నికల్లో 18 మంత్రులు ఓడిపోవడం అందుకు ఉదాహరణ అని అంటారు. అలాంటి మంత్రులతో నెట్టుకు రావడం, వైయస్ బరువును మోయడమే అవుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు అవసరమని రోశయ్య భావిస్తున్నారు. సీనియర్లను చేర్చుకుని సమర్థమైన పాలన అందించడం అవసరమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. రోశయ్య వాదనతో ఏకీభవించిన అధిష్టానం చివరకు మంత్రివర్గంలో మార్పులకు అంగీకరించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+