'సమైక్య' భృత్యువులు

Chandrababu Naidu-YS Jagan
తెలంగాణ విషయంలో పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నాయకులు ఒక్కటవుతున్నారు. విడివిడిగానే అయినా ఒకే రాగం వినిపిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు తర్వాత పరిస్థితులు క్రమంగా చల్లబడుతూ వచ్చాయి. దీన్ని ఆసరాగా చేసుకుని సీమాంధ్ర నాయకులు తెలంగాణలో కాలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ ఖమ్మం జిల్లాలో, నల్లగొండ జిల్లా మిర్యాలగుడాలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. తెలంగాణవాదులు వారిని అడ్డించినప్పటికీ వారి యాత్ర సాగింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య, అరెస్టుల మధ్య వారి పర్యటనలు సాగాయి. ఒక రకంగా తెలంగాణలో విస్తృతంగా పర్యటించేందుకు వీటిని ప్రయోగాత్మక యాత్రలుగా చెప్పవచ్చు.

జగన్ వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాసనసభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అండదండలతో ఆయన వరంగల్ జిల్లా పర్యటనకు పూనుకున్నారు. ఓదార్పు యాత్ర పేరుతో ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు సిద్ధపడ్డారు. అయితే, ఈ పర్యటనను తెలంగాణవాదులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వారితో పాటు తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి తెలుగుదేశం నాయకులు కూడా ఈ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తున్న ఎర్రబెల్లి దయాకర రావుపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. హరికృష్ణ వ్యవహారం చూస్తే సీమాంధ్ర నాయకులు తెలంగాణ విషయంలో ఒకే గొంతుతో మాట్లాడుతున్నారనేది అర్థమవుతోంది. ఇది ఒక రకంగా ఆధిపత్య ధోరణే. అన్ని పార్టీలు కూడా సీమాంధ్ర నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. తెలంగాణ నాయకులు మాత్రం రెండో స్థాయి నాయకులుగానే ఉండిపోయారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన డి. శ్రీనివాస్ ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం సీమాంధ్ర నాయకులదే. ముఖ్యమంత్రి కె. రోశయ్య, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మాత్రమే రాష్ట్ర స్థాయి నాయకులుగా చెలామణి అవుతున్నారు.

సీమాంధ్ర నాయకులు తెలంగాణపై కూడా ఆధిపత్యం సాధించడానికి ఈ ప్రాంతంలో ఒక భృత్యువర్గం ఏర్పడడమే కారణం. తెలంగాణలో సీమాంధ్ర నాయకులకు మొదటి నుంచి ఒక భృత్యువర్గం ఉంటూ వస్తోంది. వారిని ఆలంబనగా చేసుకుని సీమాంధ్ర నాయకులు తెలంగాణపై తమ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నారు. వైయస్ జగన్ కు కాంగ్రెసులో తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు అనుచర గణంగా ఉన్నారు. కొండా సురేఖ వంటి నమ్మకమైన బంట్లు చాలా మందే ఉన్నారు. దాంతో జగన్ తెలంగాణ పర్యటన ప్రభుత్వం అండదండలతో, భృత్యువర్గం సహకారంతో కొనసాగే అవకాశాలున్నాయి. అలాగే, చంద్రబాబుకు కూడా అటువంటి అనుచర గణంగా దండిగానే ఉంది. అనుచర గణం, పార్టీ కట్టుబాటు పేరుతో చంద్రబాబు కూడా తెలంగాణలో పర్యటించవచ్చు. చిరంజీవికి మాత్రమే కొంత ఇబ్బందిగా పరిణమించే పరిస్థితి ఉంది. చిరంజీవి సమైక్య నినాదం తీసుకుని భృత్యువర్గాన్ని దెబ్బ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్ర నాయకుల ఆధిపత్యంలో ఉంది. దీనివల్ల మాత్రమే చిరంజీవి తెలంగాణ యాత్ర జరగవచ్చు. ప్రభుత్వం అందుకు ఏర్పాట్లు చేయవచ్చు కూడా. మొత్తం మీద, సీమాంధ్ర నాయకులు తెలంగాణలో తిరిగి కాలు పెట్టేందుకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుందనడంలో సందేహం లేదు. వారి పర్యటనలకు తెలంగాణలోని భృత్యువర్గం సహకరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+