జగన్ పై తెలుగు తమ్ముళ్ల వార్

సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ అయిన వైయస్ జగన్ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాలో సాక్షి కార్యాలయాలను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. వైయస్ ఫోటో పెట్టుకొని జగన్ చేస్తున్న దీక్షకు అర్థం లేదన్నారు. సాక్షి మాటలు ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరన్నారు. కోట్లాది రూపాయల అక్రమ సంపాదనతో పెట్టిన సాక్షి గురించి అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్ కు సంబంధించిన సాక్షికి లేదన్నారు. సాక్షి తప్పుడు వార్తలు మానుకొని సరియైన సమాచారం ప్రజలకు ఇస్తే బావుంటుందని సూచించారు.
వైయస్ జగన్ 48గంటల దీక్షను హైలెట్ చేయడానికి రైతుల సమస్యల కోసం 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బాబును విమర్షించటం సిగ్గుచేటు అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. అందుకే ఆయన స్పందించారన్నారు. రైతుల కోసం దీక్ష అంటున్న జగన్ కు ప్రతిపక్ష చంద్రబాబు దీక్ష దొంగ దీక్షగా కనిపించటం సరికాదన్నారు. సాక్షి వ్యాఖ్యలు కేవలం చంద్రబాబుని అవమానించినట్టు కాదని రాష్ట్ర రైతాంగానికే అవమానమన్నారు. మొత్తం మీద, తమ సొంత రాజకీయాలకు ఆలవాలంగా మారిన మీడియా వార్ చంద్రబాబుకు, వైయస్ జగన్ కు మధ్య రగులుతోంది. రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా మీడియా పని చేస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications